YouTube Skip Ads Button Missing: ప్రపంచంలోని వీడియో ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. చిన్న విషయం నుంచి బుర్రకు అర్థంకాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు ఇది అడ్డాగా మారింది. అంతేకాకుండా తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు చాలామంది క్రియేటర్లు యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో అత్యధిక ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు తన ప్లాట్‌ఫారమ్‌లో స్పాన్సర్ వీడియో రికమండీషన్స్ను అందిస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేని యూజర్స్‌కు వీడియోలకు ముందు లేదా వీడియో చూస్తున్న సమయంలో మధ్యలో యాడ్స్ ఇస్తుంది. అయితే యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా యాడ్స్ వస్తే యూజర్స్‌కు చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. ఇలా మధ్యలో ప్రకటనలు రావటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో చాలా వీడియోస్‌కి కొన్ని సెకన్ల తర్వాత యాడ్స్‌ను స్కిప్ చేసేందుకు ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం యూట్యూబ్ స్కిప్ బటన్‌ను హైడ్ చేస్తోందని చాలామంది వినియోగదారులు క్లెయిమ్ చేస్తున్నారు.
యూట్యూబ్ యూజర్స్ కంప్లైంట్స్: డెస్క్‌టాప్‌లో యాడ్స్ చూస్తున్నప్పుడు స్కిప్ బటన్‌పై గ్రే కలర్ బాక్స్ కనిపించిందని కొందరు యూజర్స్ నివేదించారు. ఇందులో కౌంట్‌డౌన్ టైమర్ అసలు కన్పించంట్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్స్‌లో కూడా స్కిప్ బటన్ కనిపించట్లేదని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది.