Youtube New Features:ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ యూజర్లను ఆకర్షించడంలో భాగంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్.. వంటి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్లు ఎలా పనిచేయనున్నాయో కూడా అందులో వివరంగా తెలిపింది.
స్లీప్ టైమర్:
- యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు.
- దీంతో వీడియోలు అలానే ప్లే అవుతూ ఉంటాయి.
- ఈ సమస్యకు చెక్ పెడుతూ యూట్యూబ్ సరికొత్త స్లీప్ టైమర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
- ఈ కొత్త ఫీచర్ సాయంతో టైమర్‌ని సెట్ చేసుకొని యూట్యూబ్‌లో వీడియోస్ ప్లే చేయొచ్చు.
- మనం సెట్ చేసుకున్న టైమ్ అయిపోగానే మనం వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయినా, నిద్రలోకి జారుకున్నా వీడియో ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది.
స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?:
- యూట్యూబ్‌లో వీడియో ప్లే చేశాక స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌ని ట్యాప్ చేయగానే 'Sleep Timer' ఆప్షన్ కన్పిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి మీకు కావాల్సినంత టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు.
- ఇంతకుముందు ప్రీమియం యూజర్లకు మాత్రమే పరిమితం చేసిన ఈ ఫీచర్‌ను యూట్యూబ్.. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్లే లిస్ట్‌కు థంబ్‌నైల్స్:
- యూట్యూబ్‌లో ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఇప్పటికే ఉంది.
- ప్రస్తుతం వాటిని క్యూఆర్ కోడ్ సాయంతో నచ్చిన వ్యక్తులకు పంపే ఆప్షన్‌ను కొత్తగా తీసుకొచ్చింది.
- అంతేకాక ఆ లిస్ట్‌కు నచ్చిన థంబ్‌నైల్స్‌ను AI సాయంతో రూపొందించుకోవచ్చు.
- అందులో కావాలంటే మీ ఫొటోలను కూడా పెట్టుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది.