Whatsapp Stop Working Phones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అలాగే యూజర్ల అవసరాలకు తగినట్లు అప్డేట్లు తీసుకురావడం సహా తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ ఫోన్లలో సేవలను నిలిపివేస్తుంటుంది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్ మొబైల్స్‌లో వాట్సాప్ తన సేవల్ని ఆపేయనుంది. అందులో ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్ వెర్షన్ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అవేంటంటే?
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని మోడళ్ల మొబైల్ ఫోన్లలోనే సపోర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గల ఫోన్లలో పనిచేస్తుంది. అదే విధంగా ఐఓఎస్ 12 వెర్షన్ లేదా తర్వాతి వెర్షన్ ఐఫోన్ లలో పనిచేస్తుంది. ఈ క్రమంలో త్వరలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న 35 రకాల ఫోన్స్ ఏవో చూద్దాం.
శాంసంగ్:
- Samsung Galaxy Ace Plus
- Samsung Galaxy Core
- Samsung Galaxy Express 2
- Samsung Galaxy Grand
- Samsung Galaxy Note 3
- Samsung Galaxy S3 Mini
- Samsung Galaxy S4 Active
- Samsung Galaxy S4 Mini
- Samsung Galaxy S4 Zoom
మోటోరోలా :
- Moto G
- Moto X