WhatsApp New Feature: ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. యూజర్ల భద్రత దృష్ట్యా ఇప్పటికే చాలా ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు 'రివర్స్ ఇమేజ్ సెర్చ్' అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాలను గుర్తించేందుకు 'సెర్చ్ ఆన్ వెబ్' అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. అదెలాగంటే..?
దీన్ని ఉపయోగించడం ఎలా?:
- వాట్సప్ చాట్‌లో ఇమేజ్‌ని ఓపెన్ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్ మెనూ కనిపిస్తుంది.
- ఈ మెనూపై క్లిక్ చేయగానే పలు ఆప్షన్లు కన్పిస్తాయి.
- అందులో ‘'సెర్చ్ ఆన్ వెబ్' అనే ఆప్షన్స్ కన్పిస్తుంది.
- దాన్ని క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
- అందులో సెర్చ్‌పై క్లిక్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను స్టార్ట్ చేయొచ్చు.
- అయితే ఇలా వెబ్ సెర్చ్ కోసంగూగుల్‌కు పంపే ఇమేజెస్ గోప్యంగా ఉంటాయని, మెటాతో షేర్ అవ్వవని వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది.
ఇలా ఇమేజ్ గురించి సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన మూలం, ఆ ఫొటో ఎక్కడినుంచి వచ్చింది, ఆన్‌లైన్‌లో ఈ ఫొటోను ఎవరైనా వినియోగించారా? అనే వివరాలు కన్పిస్తాయి. దీంతోపాటు ఆ ఫొటోను ఎడిట్ చేశారా? తప్పుదారి పట్టించేలా ఏమైనా మార్చారా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.