తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇకపై వాట్సాప్​ వాయిస్ మెసెజ్​ టెక్ట్స్​ రూపంలో- కొత్త ఫీచర్​ యాక్టివేట్ చేసుకోండిలా! - WHATSAPP VOICE NOTE TRANSCRIPTS

Whatsapp Introduces Voice Note Transcripts: వినియోగదారులకు వాట్సాప్ సూపర్ అప్​డేట్​ తెచ్చింది. కమ్యూనికేషన్​ను మరింత సులభతరం చేసేందుకు మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ మెసేజ్‌గా మార్చేందుకు నోట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనే ఫీచర్​తో మనముందుకు వచ్చింది. ఏంటీ వాయిస్​ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్? ఈ ఫీచర్​ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి? వంటి వివరాలు మీకోసం.

Whatsapp_Introduces_Voice_Note_Transcripts
Whatsapp_Introduces_Voice_Note_Transcripts (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 28, 2024, 2:11 PM IST

Updated : Aug 29, 2024, 11:47 AM IST

Whatsapp Introduces Voice Note Transcripts: ప్రస్తుతం వాట్సాప్​ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇది సులువుగా, త్వరగా మెసేజ్​లు పంపడానికి, స్వీకరించడానికి వీలుగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసెజింగ్ యాప్​లలో వాట్సాప్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ తీసుకుని వస్తుంది. తాజాగా వాయిస్​ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనే కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త ఫీచర్​ గురించి మరిన్ని వివరాలను తెసుకుందాం రండి.

ఏంటీ వాయిస్​ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్?:

  • వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ కమ్యూనికేషన్​ను మరింత సులభతరం చేస్తుంది.
  • ఈ ఫీచర్​తో మనకొచ్చే వాయిస్ మెసేజ్ టెక్ట్స్​ రూపంలో కనిపిస్తుంది.
  • ఆడియో మెసెజ్ వినలేని సందర్భాల్లో, అవతలి వ్యక్తి పంపించిన వాయిస్​ మెసెజ్​ను టెక్ట్స్ రూపంలో రాసుకోవాల్సిన సందర్భంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
  • ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు వాయిస్ మెసెజెస్​ను అర్థం చేసుకోవడం, ఇంకా రిప్లై ఇవ్వటాన్ని ఇది సులభతరం చేస్తుంది.
  • ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఇంగ్లీష్, హిందీతో పాటు పోర్చుగీసు, స్పానిష్, రష్యన్ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేసుకోవడం ఎలా?:

  • ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయడానికి మొదట వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • అక్కడ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చి ఉంటే ట్రాన్‌స్క్రిప్షన్‌ ఆఫ్‌/ ఆన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఒకసారి యాక్టివేట్‌ చేసుకున్నాక వచ్చిన వాయిస్‌ నోట్స్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవడానికి దాని కిందే ఓ ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • వాయిస్ నోట్ ఆప్షన్​ను ఎనేబుల్ చేసిన తర్వాత మీ చాట్స్​లో అందుకున్న వాయిస్ మెసెజెస్​ టెక్ట్స్ రూపంలోకి వస్తుంది.
  • అంతే ఇలా సింపుల్​ ప్రాసెస్​లో వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ ద్వారా మీరు వాయిస్ మెసెజెస్​ను వినకుండానే వాటిని సులభంగా చదవవచ్చు, ఇంకా రిప్లై కూడా ఇవ్వొచ్చు.
  • ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ ఈ కొత్త ఫీచర్​ను వినియోగించుకునేందుకు వీలవుతుంది. వాట్సప్‌ వెబ్‌ వెర్షన్‌లో ఈ ఆప్షన్‌ కనిపించదు.

'లవ్'.. ఈ పేరు వినగానే మీ బ్రెయిన్​లో ఏం జరుగుతుందో తెలుసా? - Scientists FOUND How Love Lights Up

ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాక్- 'వింక్​ మ్యూజిక్​ యాప్​కు గుడ్​బై' - Airtel to Shut Down Wynk Music App

Last Updated : Aug 29, 2024, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details