తెలంగాణ

telangana

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

ETV Bharat / technology

వాట్సాప్​లో అదిరిపోయే నయా ఫీచర్- ఇకపై మీ వీడియో కాల్స్ మరింత అందగా! - whatsapp announces new feature

Whatsapp New Features for Video Calls: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ సరికొత్త ఫీచర్​ను తీసుకొస్తోంది. ఈ సరికొత్త ఫీచర్​తో వీడియోకాల్‌ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్వయంగా వెల్లడించారు.

Whatsapp New Features for Video Calls
Whatsapp New Features for Video Calls (Whatsapp Blog)

Whatsapp New Feature for Video Calls: ప్రస్తుతం ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ప్రజల జీవితాల్లో ముఖ్యభాగం అయిపోయింది. వాట్సప్ కాలింగ్‌ ఫీచర్​ను ప్రవేశపెట్టిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్​లో పెద్ద మార్పే వచ్చిందని చెప్పొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు వాట్సాప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్​కు సంబంధించి కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

ఇది వీడియో కాల్‌ సమయంలో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఉపయోగపడునుంది. ఈ ఫీచర్‌ వినియోగంపై మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానల్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు. అందుబాటులో ఉన్న వివిధ రకాల న్యూ ఫిల్టర్స్​ను ఉపయోగించిన ఫొటోలను ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏంటీ ఫీచర్? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

వాట్సప్‌ కొత్త ఫీచర్‌ ప్రత్యేకతలివే:

  • వాట్సప్‌ ఈ కొత్తఫీచర్‌ సాయంతో వీడియోకాల్‌ మాట్లాడుతున్న సమయంలో మనకు నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకునే అవకాశం రానుంది.
  • అంటే వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు నచ్చిన థీమ్‌ను సెట్‌ చేసుకోవచ్చు.
  • మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ సెట్‌ చేసుకోవచ్చన్నమాట.
  • ఉదాహరణకు మీరు వీడియోకాల్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌ని రద్దీగా ఉండే కేఫ్‌లా అయినా లేకుంటే బీచ్‌లో ఉన్నట్లుగా అయినా మార్చేయొచ్చు.
  • బ్లర్‌ ఎఫెక్ట్‌ లాంటి ఆప్షన్లు ఉంటాయి.
  • 10 రకాల బ్యాక్‌గ్రౌండ్ ఎంపికలు ఉంటాయి.
  • గోప్యతను కాపాడేందుకు స్టైలిష్‌ బ్యాక్‌గ్రైండ్‌ని జోడించొచ్చు.
  • ఇందులో వార్మ్‌, కూల్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌, డ్రీమీ ఇలా 10 రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి.
  • వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో మీ సంభాషణల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ సరికొత్త ఫీచర్‌ సాయపడనుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి ఎప్పుడు?:

  • ఈ సరికొత్త ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది.
  • మరికొన్ని వారాల్లో ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది.
  • ఈ మేరకు వెల్లడిస్తూ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది.

ఆండ్రాయిడ్ యూజర్స్​ కోసం గూగుల్ సరికొత్త ఫీచర్- దీని ఉపయోగాలు తెలిస్తే అవాక్కైపోతారంతే! - Google Launched Gemini Live

జీమెయిల్​లో సరికొత్త ఏఐ ఫీచర్- ఇకపై మీ రిప్లై మరింత స్మార్ట్‌ - Gmail Smart Reply Feature

ABOUT THE AUTHOR

...view details