Whatsapp New Features for Audio and Video Calls:వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో, వీడియో వీడియో కాలింగ్ సమయంలో మెరుగైన ఎక్స్పీరియన్స్ కోసం మరో నాలుగు ఫీచర్లను ప్రవేశపెట్టింది.
కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం..ప్రతిరోజూ వాట్సాప్ ద్వారా 2బిలియన్లకు పైగా కాల్స్ మాట్లాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది హాలీడేస్ సీజన్ కావడంతో యూజర్ కమ్యూనికేషన్ మరింత మెరుగుపర్చేందుకు ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటో తెలుసుకుందాం రండి.
వాట్సాప్ కాలింగ్‌లో కొత్త ఫీచర్లు ఇవే:
గ్రూప్ కాల్స్‌లో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే నోటిఫికేషన్:గతంలో వాట్సాప్‌గ్రూప్‌లో ఎవరైనా వీడియో కాల్ చేసినప్పుడు.. గ్రూప్‌లోని మెంబర్స్ అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వచ్చేది. అప్పుడు గ్రూప్‌లోని ఎవరైనా ఆ వీడియో కాలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో గ్రూప్ కాల్స్‌లో పార్టిసిపెంట్స్‌ను సెలెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అంటే వీడియో కాల్ చేసే సమయంలో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో గ్రూప్‌లోని మెంబర్స్ అందరికీ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ఉద్దేశంతోనే కంపెనీ ఈ ఫీచర్ పరిచయం చేసింది.
వీడియో కాల్స్‌లో న్యూ ఎఫెక్ట్స్: అంతేకాక వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ కాల్స్‌లో మరింత ఫన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా కాలింగ్ సమయంలో రకరకాల ఫన్నీ టూల్స్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఇది వాట్సాప్ గ్రూప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో స్నాప్, ఇన్‌స్టాలో మాదిరిగా కుక్కపిల్ల చెవుల వంటి 10 కొత్త వీడియో ఫన్ ఎఫెక్ట్‌లను ఉపయోగించేందుకు సహాయం చేస్తుంది.