Vivo T3 Ultra Launched:మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌లో మొబైల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. గత నెలలో T సిరీస్‌లో తీసుకొచ్చిన టీ3 ప్రో మొబైల్స్‌కు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో తాజాగా టీ3 అల్ట్రా 5జీని మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఐ ఎరేజర్, ఫొటోల క్వాలిటీ పెంచేందుకు, ఎడిట్ చేసేలా ఏఐ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
వివో టీ3 అల్ట్రా 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో తీసుకొస్తున్న ఈఫోన్ యూఎస్‌బీ 2.0 పోర్ట్, బ్లూటూత్ 5.3, వైఫై5 కు సపోర్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నట్లు వివో తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.3000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ వేదికగా వీటిని కొనుగోలు చేయొచ్చు. మరెందుకు ఆలస్యం ఈ మొబైల్ ధర, ఫీచర్లు గురించి తెలుసుకుందాం రండి.
Vivo T3 Ultra Features:
- డిస్‌ప్లే: 6.78 అంగుళాల త్రీడి కర్వ్‌డ్ అమోలెడ్
- రిఫ్రెష్ రేటు: 120Hz
- ప్రాసెసర్:మీడియాటెక్ డైమెన్సిటీ 9200+
- బ్యాటరీ:5500mAh
- మెయిన్ కెమెరా: 50ఎంపీ సోనీ IMX921
- రియర్ కెమెరా: 8 ఎంపీ అల్ట్రావైడ్
- ఫ్రంట్ కెమెరా: 50ఎంపీ
- 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
Vivo T3 Ultra Variants:వివో టీ3 అల్ట్రా 5జీ మొబైల్ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- 8జీబీ+ 128జీబీ వేరియంట్
- 8జీబీ+ 256జీబీ వేరియంట్
- 12జీబీ+ 256జీబీ వేరియంట్