Things to keep in Mind While Buying Kitchen Utensils:సాధారణంగా మనం వంట పాత్రలు కొనుగోలు చేసేటప్పుడు మన్నిక కోసం దాని థిక్నెస్ చూస్తాం. దీంతోపాటు అది ఆకర్షణీయమైన ఆకృతిలో ఉందో లేదో చూసుకుంటాం. ఫైనల్గా ధరకు తగిన క్వాలిటీ ఉందో లేదో చూస్తాం. ఎవరైనా ఇవే చూసి వంట పాత్రలు కొనుగోలు చేస్తారు. అయితే ఇకపై వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు ISI (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) మార్క్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వంట పాత్రలకు ఎందుకు ISI మార్క్ ఉండాలంటోంది? దీనివల్ల లాభాలేంటి? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
వంట పాత్రలకు ISI ఎందుకు?:
- వంట పాత్రలపై ISI మార్క్ ఉండాలని DPIIT (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఈ ఏడాది మార్చిలో ఆదేశాలను జారీ చేసింది.
- నాసిరకం ఉత్పత్తుల నుంచి వినియోగదారులను రక్షించడంలో ఇది సహాయపడుతుంది.
- ISI ముద్ర లేని పాత్రల ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, పంపిణీ, నిల్వ చేయొద్దని BSI (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్) ఆదేశించింది.
- ఈ ఆదేశాలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపింది.
- కస్టమర్ల సేఫ్టీ కోసం, ప్రొడక్ట్స్ క్వాలిటీని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
- జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ఇది తోడ్పడుతుందని BSI భావిస్తోంది.