తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 1:54 PM IST

ETV Bharat / technology

ఫోన్​ ఛార్జింగ్​ పెట్టే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా! - Mobile Charging Avoid Mistakes

Mobile Charging Avoid Mistakes : ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మెజారిటీ జనం కొన్ని తప్పులు చేస్తారు. మీరు కూడా ఇవి చేస్తున్నారా? చేస్తే ఏమవుతుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Avoid These Mistakes While Mobile Charging
Mobile Charging Avoid Mistakes (ETV Bharat)

Avoid These Mistakes While Mobile Charging : చాలా మందికి నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకొనే వరకు చేతిలో ఫోన్ లేకపోతే ఉండలేరు. అయితే.. చాలా స్మార్ట్​ఫోన్లలో(Smartphone) ఛార్జింగ్ వెంట వెంటనే అయిపోతుంటుంది. దీంతో.. కొంతమంది బ్యాటరీ లైఫ్ అయిపోయిందని భావించి.. కొత్త ఫోన్ కొనడమో, బ్యాటరీ మార్చడమో చేస్తుంటారు.

కానీ.. చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ఫోన్​ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లే కారణంగానే త్వరగా ఛార్జింగ్ అయిపోవడం, బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం, పాడవ్వడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. ఇంతకీ.. ఛార్జింగ్ వేగంగా అయిపోకుండా, బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే.. ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేయకూడని ఆ పొరపాట్లేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేయకూడని పొరపాట్లు :

  • ఫోన్ ఛార్జింగ్ విషయంలో మనలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోయే వరకు ఛార్జింగ్​ పెట్టరు. ఈ మిస్టేక్ బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఎప్పుడు కూడా మొబైల్ ఛార్జింజ్ జీరో అయ్యే వరకు వెయిట్ చేయవద్దని సూచిస్తున్నారు.
  • మొబైల్ ఛార్జ్ విషయంలో మెజార్టీ పీపుల్ చేసే మరో మిస్టేక్ ఏంటంటే.. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు ఛార్జింగ్ పెడుతుంటారు. మీరు చేసే ఈ పొరపాటు కూడా బ్యాటరీ లైఫ్​ను తగ్గించి త్వరగా ఛార్జింగ్ అయిపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే బ్యాటరీని ఎప్పుడూ 100% వరకు ఛార్జ్ చేయకూడదని చెబుతున్నారు.
  • ఇవేకాకుండా.. కొంతమంది రాత్రిపూట ఫోన్​ను ఛార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. ఇది కూడా బ్యాటరీ జీవితకాలాన్ని దెబ్బతీస్తుందంటున్నారు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎక్కువ గంటలు ప్లగ్ ఇన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్​ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

మీ ఐఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్​! - How To Maximize IPhone Battery Life

ఫోన్‌ ఛార్జ్ చేయడానికి సరైన మార్గం :

  • మీ ఫోన్ ఎక్కువ రోజులు ఎలాంటి రిపేర్లు రాకుండా ఎప్పుడూ కొత్తదానిలా పనిచేయాలంటే దానిని జాగ్రతగా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుందంటున్నారు.
  • అవేంటంటే.. ఫోన్ బ్యాటరీ ఎప్పుడూ జీరోకి రాకుండా చూసుకోవాలి. బ్యాటరీ 20 శాతం ఉండగానే ఛార్జింగ్​ పెట్టాలి.
  • అలాగే 100% వరకు ఛార్జ్ చేయవద్దు. బ్యాటరీ స్థాయి 80%కి చేరుకున్నప్పుడు ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
  • అలాగే, మీ ఫోన్ మోడల్ కోసం ఉద్దేశించిన ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించేలా చూసుకోవాలి.
  • అదేవిధంగా.. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఇది ప్రాసెసర్‌కు ఉపశమనం కలిగిస్తుంది. ఫలితంగా బ్యాటరీ హీట్ ఎక్కే సమస్యను తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

పబ్లిక్ కేబుళ్లతో ఫోన్ ఛార్జింగ్ యమా డేంజర్​- ఈ టిప్స్ పాటించకపోతే మీ డేటా అంతా చోరీ! - Public USB Phone Charging problems

ABOUT THE AUTHOR

...view details