Tata Nexon iCNG Launched:వాహన ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గుడ్‌న్యూస్ తెచ్చింది. తన నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఇప్పటికే నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్లు ఉండగా తాజాగా సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇండియాలో టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ వాహనంగా ఈ కారు నిలిచింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నెక్సాన్ ఐసీఎన్‌జీ తీసుకొచ్చింది.
అత్యాధునిక ఫీచర్లతో డ్యూయల్ సిలిండర్ సదుపాయంతో దీన్ని విడుదల చేసింది. రెండు స్లిమ్ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుందని టాటామోటార్స్ తెలిపింది. సీఎన్‌జీ మోడ్‌లో ఇంధన సామర్థ్యం కిలోగ్రాముకు 24 కిలోమీటర్లు అని పేర్కొంది. 8 వేరియంట్స్‌లో దీన్ని తీసుకొచ్చారు. దీని అన్ని వేరియంట్లలో కూడా 6 ఎయిర్ బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లను జోడించినట్లు కంపెనీ చెబుతోంది. హారియర్, సఫారితో ఎంతో ఆదరణ పొందిన రెడ్ డార్క్ ఎడిషన్‌నూ దీంట్లో తీసుకొచ్చారు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, ఇంజిన్ వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.
టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ స్పెసిఫికేషన్స్:
10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
ఇంజిన్:1.2 లీటర్ల టర్బో పెట్రోల్
టార్క్:98 bhp, 170 Nm
6 ఎయిర్ బ్యాగ్‌లు
పనోరమిక్ సన్‌రూఫ్