Simple One Gen 1.5 Electric Scooter Launched:బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కొత్త విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది సింపుల్ వన్ అప్‌డేట్ వెర్షన్‌తో వచ్చిన కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్కూటర్. సింపుల్ ఎనర్జీ దీన్ని కొత్త సాఫ్ట్‌వేర్, కొంగొత్త డిజైన్‌తో రూపొందించింది. అంతేకాక మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అందించే వాటిలో అత్యధిక రేంజ్‌తో దీన్ని లాంఛ్ చేసింది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
సింపుల్ వన్ జెన్ 1.5 లాంఛ్:ఈ కొత్త స్కూటర్ పేరు 'వన్ జెన్ 1.5'. కంపెనీ దీన్ని 248 కిలోమీటర్ల రేంజ్‌తో తీసుకొచ్చింది. ఇది ప్రీవియస్ మోడల్ కంటే 36 కిలోమీటర్లు ఎక్కువ. మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ-వీలర్ అందించే వాటిలో అత్యధిక రేంజ్ ఇది. ఇకపోతే కంపెనీ దీని ప్రీవియస్ మోడల్‌ను అంటే 'సింపుల్ వన్ జెన్ 1' స్కూటర్‌లో 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందించింది.
ఫీచర్లు:ఈ కొత్త 'సింపుల్ వన్ జెన్ 1.5' స్కూటర్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో బ్లూటూత్, కాల్, SMS, వాట్సాప్ నోటిఫికేషన్స్‌ను అందించే యాప్ ఇంటిగ్రేషన్‌తో పాటు నావిగేషన్, OTA అప్‌డేట్స్, ఆటో బ్రైట్‌నెస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), కొత్త రైడ్ మోడ్స్, పార్క్ అసిస్టెంట్ ఫీచర్, ఫైండ్ మై వెహికల్ ఫీచర్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ర్యాపిడ్ బ్రేక్, డ్యాష్ థీమ్, ట్రిప్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్, USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ సౌండ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి.
పవర్‌ట్రెయిన్:ఈ 'సింపుల్ వన్ జెన్ 1.5' ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ 8.5kW పవర్, 72Nm టార్క్‌ను అందిస్తుంది. దీంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని సింపుల్ ఎనర్జీ సంస్థ తెలిపింది. ఇది 30 లీటర్ల కంటే ఎక్కువ బూస్ట్‌స్పేస్ అంటే సీటు లోపల ఖాళీ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల కంపెనీ దీన్ని క్లాస్ బూట్‌స్పేస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యుత్తమమైనదిగా పేర్కొంది.
బ్యాటరీ ప్యాక్:కంపెనీ ఈ స్కూటర్‌లో ఇచ్చిన బ్యాటరీ సెటప్‌లో ఫిక్స్డ్ 3.7kWh బ్యాటరీ ప్యాక్, 1.2kWh రిమూవబుల్ బ్యాటరీని అందించింది. అయితే స్కూటీ రేంజ్‌ను పెంచేందుకు వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌తో ఈ రెండు బ్యాటరీలను ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ స్కూటర్‌లో 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, LED లైట్నింగ్ సదుపాయం కూడా ఉంటుంది.