తెలంగాణ

telangana

ETV Bharat / technology

మార్కెట్లో ఏఐ హవా- 2028 నాటికి 730 మిలియన్ Gen AI స్మార్ట్‌ఫోన్స్​ షిప్‌మెంట్స్​: రిపోర్ట్ - GEN AI SMARTPHONES

2028 నాటికి Gen AI స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్స్ 730 మిలియన్ యూనిట్లకు మించి ఉంటాయి: నివేదిక

Gen-AI Smartphones
Gen-AI Smartphones (IANS)

By ETV Bharat Tech Team

Published : Oct 21, 2024, 12:29 PM IST

Gen-AI Smartphones:ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇది దాదాపు అన్ని రంగాలకు వ్యాపిస్తోంది. చాలావరకు అన్ని సంస్థలు ఏఐను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Gen AI) స్మార్ట్​ఫోన్ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది. 2028 నాటికి Gen AI స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్స్ 730 మిలియన్ యూనిట్లకు మించి ఉంటాయని పేర్కొంది.

అంచనాలకు మించి: ఈ ఏడాది GenAI స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ వాటా 19 శాతానికి చేరుకుంటుందని, 2028 నాటికి 54 శాతానికి చేరుకోవచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ వృద్ధి 2024లో అంచనా వేసిన స్థాయి కంటే 3 రెట్లు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది గ్లోబల్​ Gen AIస్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 75 శాతానికి పైగా శామ్‌సంగ్, యాపిల్‌ ఆక్రమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అభివృద్ధి చెందిన మార్కెట్లో స్ట్రాంగ్​ ప్రెజన్స్​తో ప్రీమియం సెగ్మెంట్​లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి​ ప్రీమియం సెగ్మెంట్​లో టాప్ బ్రాండ్స్​గా కొనసాగుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

అధిక ఆదాయం, న్యూ టెక్నాలజీపై ఆసక్తి, ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఉందని ఈ నివేదిక పేర్కొంది. సెమీకండక్టర్ సెక్టార్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఇది 2030 నాటికి $339 బిలియన్లకు చేరుతుందని అంచనా. ముఖ్యంగా ఆన్-డివైస్ GenAI ఇంప్లిమెంటేషన్​తో ఇది సాధ్యమవుతుంది. టెక్నాలజీ 2030 నాటికి సెమీకండక్టర్ వ్యయాన్ని దాని బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM)లో 45 శాతానికి పెంచుతుందని నివేదిక పేర్కొంది.

Gen AI స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తోంది. ఇది బిగ్ స్క్రీన్స్​, ఫాస్టర్ ప్రాసెసర్స్, కెమెరా వంటి హార్ట్​వేర్​ వంటి వాటితో యూజర్స్​కు మంచి ఎక్స్​పీరియన్స్​ను అందించడంపై ఫోకస్ చేస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (OEMs) మధ్య పోటీ మరింత ఎక్కువగా ఉండనుందని ఈ నివేదిక తెలిపింది.

యాపిల్ ఇంటెలిజెన్స్​తో మినీ ఐప్యాడ్ లాంచ్- స్టూడెంట్స్​కు స్పెషల్ ఆఫర్..!

దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్- ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details