Scientists Reveals How Love Lights Up:ప్రేమ.. ఇది మనసులో కలిగే ఓ పవిత్ర భావన. ఒక వ్యక్తి మరొకరిని ప్రేమించేలా చేయడం సాక్షాత్తూ ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ఇది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది. ప్రియురాలిపై ప్రియుడి ప్రేమ, తల్లిదండ్రులపై పిల్లల ప్రేమ, పెంపుడు జంతువులపై ప్రేమ, కొంతమందికి ప్రకృతి అంటే ప్రేమ. ఇలా సమాజంలో ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి. వాటిని చదవగలిగితే జీవితం పరిపూర్ణం అయినట్లే.
అంతటి విశేషమైన ప్రేమ గురించి ఫిన్లాండ్కు చెందిన ఆల్టో యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు చేశారు. సమాజంలో 6 రకాల ప్రేమలపై వారు చేసిన అధ్యయనంలో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ గుర్తించారు. ఈ పరిశోధనల కోసం వారు ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్(FMRI) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ రీసెర్చ్‌లో వారు గుర్తించిన ఇంట్రస్టింగ్ అంశాలను పరిశోధనకు నాయకత్వం వహించిన పార్టీలీ రినే వెల్లడించారు. ఈ వివరాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కు చెందిన సెరెబ్రల్ కార్టెక్స్ జర్నల్‌లో ప్రచురించారు.
సైంటిస్ట్స్ రీసెర్చ్‌లో గుర్తించిన ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే?:
- మనం సమాజంలోకి వెళ్లినప్పుడు ఆయా పరిస్థితులను బట్టి లవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.
- అలాంటి సందర్భాల్లో నుదుటి మధ్య రేఖ, ప్రిక్యూనియస్, మెదడులోని బేసల్ గాంగ్లియా, తల వెనుక భాగంలో ఉండే టెంపోరోపారిటల్ జంక్షన్ భాగాలు స్పందిస్తాయి.
- ఇలా విభిన్న రకాల ప్రేమలు మెదడులోని వేర్వేరు ప్రాంతాలను ప్రేరేపితం చేస్తాయి. ఉదాహరణకు ప్రియురాలిపై ప్రేమ మెదడులోని ఒక భాగాన్ని చైతన్యం చేస్తే.. తల్లిదండ్రుల ప్రేమ మెదడులోని మరో ప్రాంతాన్ని స్పందించేలా చేస్తుంది.
- తల్లిదండ్రుల ప్రేమ మెదడు లోపలి భాగంలో ఉండే స్ట్రియాటమ్‌లో మధురానుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ మరే ఇతర రకాల ప్రేమల్లోనూ మనకు కనిపించదు.
- ఇందులో మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అయినవాళ్లు, సన్నిహితులపై కలిగే ప్రేమతో పోల్చితే, కొత్త వ్యక్తులపై కలిగే ప్రేమ మన మెదడును ఎక్కువగా ప్రేరేపితం చేయదట.
ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవటం ఎలా?- ఈజీ ప్రాసెస్ ఇదే! - Aadhaar Card Free Update
విమానాన్ని వాడని మోదీ- రైలులో ప్రయాణం- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? - PM Modi Traveled in Train Force One