Samsung Galaxy First Smart Ring: దక్షిణ కొరియా టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తన మొదటి స్మార్ట్ రింగ్‌ను లాంచ్ చేసింది. మతి చెదిరే ఫీచర్లతో మూడు కలర్ ఆప్షన్లతో వీటిని తీసుకొచ్చింది. తొమ్మది వేర్వేరు సైజుల్లో ఈ స్మార్ట్ రింగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఈవెంట్లో గెలాక్సీ జీ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ఈ రింగ్‌ను శాంసంగ్ ఆవిష్కరించింది. తాజాగా ఈ స్మార్ట్‌రింగ్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్‌రింగ్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇండియాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై లుక్కేద్దాం రండి.
శాంసంగ్ తొలి స్మార్ట్ రింగ్ ఫీచర్స్:
- ఈ శాంసంగ్ స్మార్ట్ రింగ్‌లో ఏఐ ఆధారిత హెల్త్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
- ఇది IP68 రేటింగ్‌తో వస్తోంది.
- గెలాక్సీ ఏఐ సదుపాయంతో తీసుకొచ్చిన ఈ రింగ్‌తో అనేక రకాల హెల్త్ ఫీచర్లను ట్రై చేయొచ్చని శాంసంగ్ చెబుతోంది.
- స్లీప్ స్కోర్, స్నోరింగ్ అనాలసిస్, స్లీప్ మెట్రిక్, స్లీప్ లేటెన్సీ, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేటు వంటివి ఈ రింగ్ ట్రాక్ చేస్తుంది.
- శాంసంగ్ హెల్త్ యాప్‌లో ఈ వివరాలన్నీ నమోదవుతాయి.
- ఈ రింగ్ సింగిల్ ఛార్జితో ఏడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని శాంసంగ్చెబుతోంది.
- టైటానియమ్ బాడీతో తీసుకొచ్చిన ఈ రింగ్‌లో స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఫీచర్లు ఉన్నాయి.
- ఈ ఫీచర్ల సాయంతో ఫొటోస్ తీయడం, అలారమ్ ఆఫ్ చేయడం వంటివి చేయొచ్చు.
శాంసంగ్ స్మార్ట్ రింగ్‌లో కలర్ ఆప్షన్స్:
- టైటానియమ్ బ్లాక్
- టైటానియమ్ సిల్వర్
- టైటానియమ్
- గోల్డ్