Samsung Galaxy G Fold:హువావే ట్రై ఫోల్డ్ మొబైల్‌కు పోటీగా శాంసంగ్ 'గెలాక్సీ G ఫోల్డ్' స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ దీనితో పాటు జులై మధ్యలో ఫోల్డబుల్ ఫోన్‌లుగా విడుదల కానున్న ఈ నెక్స్ట్ జనరేషన్ 'గెలాక్సీ Z ఫోల్డ్ 7', 'గెలాక్సీ Z ఫ్లిప్ 7' మోడల్స్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా పబ్లికేషన్ నుంచి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం శాంసంగ్ వీటితో పాటు కొత్త 'గెలాక్సీ G ఫోల్డ్' స్మార్ట్‌ఫోన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని, ఇది కంపెనీ గతంలో టీజ్ చేసిన కొత్త ఫారమ్ ఫ్యాక్టర్‌లో వస్తుందని సూచిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో 'హువావే మేట్ XT అల్టిమేట్ ఎడిషన్' వంటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడగలదని తెలిపింది.
ప్రత్యేక ఎక్స్టెర్నల్ డిస్ప్లే:నివేదికల ప్రకారం శాంసంగ్ 'గెలాక్సీ G ఫోల్డ్' ప్రత్యేక బాహ్య డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇండస్ట్రీ సోర్సెస్‌ను ఉటంకిస్తూ, ETNews (కొరియన్‌లో) శాంసంగ్ కొత్త 'డబుల్-ఫోల్డింగ్' ఫోల్డబుల్ ఫోన్‌పై పనిచేస్తోందని నివేదించింది. 'శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్' పేరుతో ఈ ఫోన్ 'గెలాక్సీ Z ఫోల్డ్ 7', 'గెలాక్సీ Z ఫ్లిప్ 7' మోడల్స్‌తో పాటు అభివృద్ధి దశలో ఉందని తెలిపింది. కంపెనీ ఏప్రిల్‌లో ఈ కొత్త హ్యాండ్‌సెట్ కోసం విడిభాగాలను కొనుగోలు చేస్తుందని సమాచారం. శాంసంగ్ దీనిని అప్‌కమింగ్ బుక్-స్టైల్, క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లతో ప్రారంభించొచ్చు.
అయితే ఇది జరిగితే మూడు ప్యానెల్‌లను కలిగి ఉన్న ఇన్నర్ డిస్‌ప్లేతో 'డబుల్-ఫోల్డింగ్' హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ శామ్‌సంగ్ ఏం అవతరించదు. ఎందుకంటే 'హువావే మేట్ XT అల్టిమేట్ ఎడిషన్' గతేడాది కమర్షియల్‌గా లభించే మొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌గా ప్రారంభం అయింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్ చేసిన కంపెనీగా హువావే అవతరించింది. అయితే ఈ రూమర్డ్ హ్యాండ్‌సెట్ కోసం శాంసంగ్ అదే S-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్‌ను ఉపయోగించకపోవచ్చని తెలుస్తోంది.
నివేదిక ప్రకారం హువావే స్మార్ట్‌ఫోన్ మాదిరిగా S-ఆకారంలో బెండ్ చేయగలికే ఫోల్డబుల్ డిస్‌ప్లేకు బదులుగా, శామ్‌సంగ్ G-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌ను రూపొందించొచ్చు. ఇది నిజమైతే 9.96-అంగుళాల లోపలి స్క్రీన్‌ను కలిగి ఉన్న మూడు ప్యానెల్‌లు డివైజ్‌ను మడతపెట్టినప్పుడు హైడ్ అవుతాయి.