తెలంగాణ

telangana

ETV Bharat / technology

భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత- గ్యాస్ సిలిండర్లు వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - LPG Gas Cylinder Safety Precautions

LPG Gas Cylinder Safety Precautions: ప్రస్తుతం ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ల వాడకం ఎక్కువ అయిపోయింది. ఏ ఇంట్లో చూసినా గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ మంటలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక మహిళలు చాలా భయపడుతుంటారు. అయితే గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

LPG_Gas_Cylinder_Safety_Precautions
LPG_Gas_Cylinder_Safety_Precautions (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 4, 2024, 3:55 PM IST

LPGGas Cylinder Safety Precautions: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇది ఎంత ఉపయోగకరమో ఆదమరిస్తే అంతే ప్రమాదం. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిలిండర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సిలిండర్లను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ISI గుర్తు ఉన్న LPG గ్యాస్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలి.
  • గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో సిలిండర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్​ చేసుకోవాలి.
  • సిలిండర్​ను ఎప్పుడూ వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలోనే ఉంచాలి.
  • మీకు సిలిండర్​ను సరిగా అమర్చటం రాకుంటే సర్వీస్​ మ్యాన్ లేదా డెలివరీ పర్సన్​ సహాయం తీసుకుంటే మంచిది.
  • సిలిండర్​కు సమీపంలో పేలుడుకు కారణమయ్యే కిరోసిన్, పెట్రోల్ లాంటి ఫ్యూయల్స్​ లేకుండా చూసుకోండి.
  • గ్యాస్ సిలిండర్​ను ఉంచే గదిలో గ్యాస్ డిటెక్టర్లను ఇన్​స్టాల్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా సిలిండర్​ నుంచి గ్యాస్ లీక్​ అయితే ఇది హెచ్చరిస్తుంది.
  • వంట అయిపోయిన వెంటనే గ్యాస్ సరఫరాను ఆఫ్​ చేయాలి. దీంతోపాటు బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్​ చేశామో లేదో ఓసారి చెక్​ చేసుకుంటే మంచిది.
  • గ్యాస్ లీకేజీలను నివారించేందుకు ఎల్‌పిజి స్టవ్, కనెక్షన్‌లను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి.
  • పిల్లలను ఎప్పుడూ వంటగదికి, ఎల్​పీజీ సిలిండర్​కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఒకవేళ ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్​ అయినట్లయితే కిటికీలను తెరచి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేయాలి. LPG సప్లయర్ లేదా ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించాలి.

నో డెలివరీ ఛార్జీస్:

  • ఇంటి వద్దకు డెలివరీ అయ్యే ఎల్​పీజీ సిలిండర్లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని HPCL స్పష్టం చేసింది.
  • ఫ్లోర్, అపార్ట్మెంట్స్​.. ఇలా లొకేషన్స్​తో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది.
  • ఒకవేళ డెలివరీ వ్యక్తి అదనపు ఛార్జీలు అడిగితే చెల్లించకుండా తిరస్కరించే అధికారం కస్టమర్లకు ఉంటుంది.
  • ఈ సమస్యపై హైదరాబాద్‌కు చెందిన కరీం అన్సారీ అనే వ్యక్తి HPCLపై RTI పిటిషన్​ దాఖలు చేశారు.
  • దీనిపై HPCL స్పందిస్తూ వినియోగదారులు సిలిండర్ డెలివరీల కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ డెలివరీ బాయ్ అదనపు ఛార్జీలను అడిగితే తిరస్కరించే అధికారం కస్టమర్లకు ఉందని పేర్కొంది.

మహిళలూ జాగ్రత్త- ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్! - Women Safety Gadgets

వంట పాత్రలు కొనుగోలు చేస్తున్నారా?- ఈ మార్క్ లేకుంటే చర్యలు తప్పవు! - Buying Kitchen Utensils Precautions

ABOUT THE AUTHOR

...view details