Royal Enfield Flying Flea C6:దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో పలు కంపెనీలు సరికొత్త ఫీచర్లతో వీటిని రిలీజ్ చేయడంపై ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలు ఈ విభాగంలో బైక్స్‌ను లాంచ్ చేశాయి. తాజాగా చెన్నైకు చెందిన ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఈవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది.
దేశంలో 250-750సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో నంబర్ వన్‌గా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇది రెట్రో- ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఇకపై మార్కెట్లోకి తీసుకొచ్చే అన్ని ఎలక్ట్రిక్ బైక్‌లను 'ఫ్లయింగ్ ఫ్లీ' పేరిట ఆవిష్కరించనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఫీచర్లు:
- ఈ మోటార్ సైకిల్ రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లతో రానుంది.
- ఇది ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
- రెండు సీట్ల వెర్షన్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో ఉండనున్నట్లు అంచనా.
- ఈ బైక్ టీఎఫ్టీ డిస్ప్లేతో రానుంది.
- ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
- ఈ బైక్ లుక్‌ను రివీల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. దీని ధర, ఫీచర్లపై పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
- త్వరలోనే ఆ వివరాలన్నీ ప్రకటించే అవకాశం ఉంది.
- కంపెనీ 2026లో మార్కెట్లోకి ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.