Renewed Vs Refurbished Phones : రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌లు చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? వాటిలో ఏది కొనాలో అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారా? అయితే బెంగపడొద్దు. మీకు ఇక్కడ పూర్తి సమాచారం లభిస్తుంది. రీన్యూడ్, రీఫర్బిష్డ్, ప్రీ ఓన్డ్, యూజ్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏమిటనేది మీరు ఇక్కడ తెలుసుకుంటారు. వాటిలో ఏది ఎంచుకోవాలి? సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఏమేం చెక్ చేయాలి? అనే దానిపై మీకు ఈ కథనంలో ఉపయోగకర సమాచారం లభిస్తుంది.
తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఒక విషయం మాత్రం క్లియర్. అదేమిటంటే రీన్యూడ్ అన్నా, రీఫర్బిష్డ్ అన్నా అప్పటికే వినియోగించిన ప్రోడక్ట్స్ అని అర్థం. వాటికి రిపేర్లు చేసి కాస్త బెటర్ కండీషన్‌లోకి తెచ్చి విక్రయిస్తుంటారు.
- ప్రీ ఓన్డ్, యూజ్డ్ ప్రోడక్ట్స్ అంటే రిపేర్ చేసినవి కావు. వినియోగదారులు కొని, వాడకముందే కంపెనీకి వాపసు చేసిన ప్రోడక్ట్స్‌ను ఈ పేర్లతో పిలుస్తారు.
- సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్‌ను కొనే ముందు తప్పకుండా దానికి వారంటీ తీసుకోండి. ఒకవేళ దాని పనితీరు బాగాలేకపోతే ఎప్పటిలోగా వాపసు చేయొచ్చో తెలుసుకోండి.
- ప్రత్యేకించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారు సర్టిఫైడ్ రిన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ విక్రేతల నుంచే కొనుగోళ్లు చేయాలి. ఎందుకంటే సర్టిఫైడ్ సెల్లర్స్ దాదాపు కొత్త దానిని తలపించే రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను అమ్ముతుంటారు.
రిన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు తేడా ఏమిటి ?
- రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌తో పోలిస్తే రిన్యూడ్ ప్రోడక్ట్స్ తక్కువ కాలం పాటు వాడినవి.
- రిన్యూడ్ ప్రోడక్ట్స్ మంచి కండీషన్‌లో ఉంటాయి. వాటి పనితీరు కూడా దాదాపుగా కొత్తదానిలాగే ఉంటుంది.
- అమెజాన్ తమ సైట్‌లో రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను కూడా విక్రయిస్తుంటుంది. అవి మంచి కండీషన్‌లోనే ఉంటాయి. అయితే అన్నీ అలాగే ఉంటాయని చెప్పలేం. తమ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు అమెజాన్ ప్రీమియం, ఎక్సలెంట్, గుడ్, యాక్సెప్టబుల్ కండీషన్ అనే లేబుల్స్ ఇస్తుంటుంది.
- రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను రిటైలర్లు లేదా థర్డ్ పార్టీ సంస్థలు విక్రయిస్తుంటాయి. ఎవరు విక్రయిస్తున్నారు అనే దాని ఆధారంగా మనం ఆ ప్రోడక్ట్ క్వాలిటీపై ప్రాథమిక అంచనాకు రావచ్చు.
- సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అనేవి స్వయంగా ఆయా కంపెనీలే రిపేర్ చేసి పునరుద్ధరించినవి. అందుకే సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు కొనుగోలులో ప్రయారిటీ ఇవ్వొచ్చు.
- ఈబే, క్రెయిగ్స్ లిస్ట్ వంటి థర్డ్ పార్టీ విక్రేతలు పాత ఉత్పత్తులను సరిచేసి ఆన్‌లైన్ మార్కెట్‌లో విక్రయిస్తుంటాయి. వీటి రేట్లు సర్టిఫైట్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ కంటే తక్కువగా ఉంటుంది. అయితే గతంలో ఆ ప్రోడక్ట్స్‌లో ఎలాంటి సమస్య ఉండేది? దాన్ని ఎంత వరకు మరమ్మతు చేశారు? అనే దానిపై మీకు క్లారిటీ రాదు. అందుకే వీటికి కొనుగోలులో తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి.
యూజ్డ్, ప్రీ ఓన్డ్, ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్స్ మధ్య తేడా ఏమిటి?
- ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ అంటే కొత్తదే. సీల్ తెరిచినది కావడం వల్ల దానికి ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ అనే పేరు వచ్చింది. యూజ్డ్ ప్రోడక్ట్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్ అంటే వాడినవి. అంటే అవి పాతవే.
- గతంలో వాడినది అని చెప్పలేక సౌమ్యంగా 'ప్రీ ఓన్డ్' అనే పదాన్ని వాడుతుంటారు.
- రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను రిపేర్ చేసి పునరుద్ధరిస్తారు. కానీ యూజ్డ్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్స్‌ను రిపేర్ చేయరు. వాటి తాజా కండీషన్‌లోనే నేరుగా విక్రయానికి పెడతారు.
- సర్టిఫైడ్ సెల్లర్స్ దగ్గర యూజ్డ్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్స్ మంచి కండీషన్‌లో లభిస్తాయి. వాటితో ముడిపడిమైన కచ్చితమైన సమాచారం కూడా వారి వద్ద అందుబాటులో ఉంటుంది.