Reliance Jio Updates Rs 949 Recharge Plan:జియో యూజర్లకు గుడ్‌న్యూస్. రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అప్‌డేట్ చేసింది. తాజాగా ఈ ప్లాన్‌లో 'జియోహాట్‌స్టార్'కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను చేర్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కలిసి 'జియోహాట్‌స్టార్' పేరుతో ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా అవతరించాయి.
జియోహాట్‌స్టార్ ఈ రెండు కంపెనీల కంటెంట్ లైబ్రరీని కంబైన్ చేస్తుంది. అంటే ఇకపై జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్ అంతా ఒకేచోట వీక్షించొచ్చు. ఇది వివిధ ఇంటర్నేషనల్ స్టూడియోస్ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను అందిస్తుంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ.149 నుంచే ప్రారంభమవుతాయి. ఈ కొత్త సర్వీస్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో యాడ్-సపోర్టెడ్తో పాటు యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం ప్రీమియం ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌లో 3 నెలల వ్యాలిడిటీతో బేస్ ప్లాన్ రూ.149 నుంచి, ప్రీమియం ప్యాక్ నెలకు రూ.299 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక వినియోగదారులు ఈ కంటెంట్‌ను వీక్షించేందుకు నెలవారీ, వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నప్పటికీ జియో ఇప్పుడు అప్‌డేట్ చేసి తీసుకొచ్చిన రూ.949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 'జియోహాట్‌స్టార్' యాడ్-సపోర్టెడ్ బేస్ ప్లాన్‌కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రస్తుత సబ్‌స్క్రైబర్‌లు ఆటోమేటిక్‌గా 'జియోహాట్‌స్టార్'కు మారుతున్నప్పటికీ, ఈ ఫ్రీ యాక్సెస్ 'జియోహాట్‌స్టార్' యూజర్ బేస్‌ను మరింత పెంచుతుందని కంపెనీ భావిస్తోంది.
జియో రూ.949 రీఛార్జ్ ప్లాన్:రిలయన్స్ జియో ఈ రూ.949 రీఛార్జ్ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటా, అన్లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. అయితే తాజాగా అప్‌డేట్ తర్వాత వీటితో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ఇప్పుడు 'జియోహాట్‌స్టార్' రూ. 149 విలువైన యాడ్-సపోర్టెడ్ బేస్ ప్లాన్‌కు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.
దీంతో ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3 నెలల పాటు లైవ్ స్పోర్ట్స్, డిస్నీ ఒరిజినల్స్, లేటెస్ట్ సినిమాలను ఉచితంగా వీక్షించొచ్చు. అయితే ఈ ప్లాన్ అందిస్తున్న ఈ సౌకర్యం మొబైల్లో మాత్రమే పనిచేస్తుందని గమనించాలి. దీంతో కంటెంట్‌ను 720 పిక్సెల్స్ రిజల్యూషన్ వరకు మాత్రమే వీక్షించొచ్చు.