JioFinance App Launched: దేశంలోనే అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టింది. 'జియో ఫైనాన్స్' పేరిట యాప్‌ను ప్రవేశపెట్టినట్లు శుక్రవారం కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మై జియోలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ తెలిపింది.
కాగా ఈ ఏడాది మే 30నే యూపీఐ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా 'జియో ఫైనాన్స్' బీటా/ పైలట్ వెర్షన్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం యూజర్స్ నుంచి సలహాలు, సూచనల మేరకు నేడు పూర్తిస్థాయి యాప్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
ఐదే నిమిషాల్లో అకౌంట్ ఓపెన్: కేవలం 5 నిమిషాల్లోనే ఈ డిజిట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చని రిలయన్స్ తెలిపింది. బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డ్‌తో ఎలాంటి సమస్యలు లేకుండా బ్యాంకు ఖాతాను పొందొచ్చని కంపెనీ అధికారిక ప్రకటనలో వివరించింది. ఈ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, బీమా సలహాదారు వంటి సర్వీసులు పొందొచ్చని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.