Realme P3 Series Launched:రియల్‌మీ తన P3 సిరీస్‌ను దేశీయ మార్కెట్లో ఇవాళ లాంఛ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్‌మీ P3 ప్రో 5G', 'రియల్‌మీ P3x 5G' అనే రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ రెండింటినీ 6000mAh బ్యాటరీ ప్యాక్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ సదుపాయాలతో వస్తున్నాయి. అంతేకాక వీటి కొనుగోలుపై కంపెనీ మంచి ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ సందర్భంగా రియల్‌మీ రిలీజ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ఫోన్ల ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్లతో పాటు ఆఫర్ల వివరాలను తెలుసుకుందాం రండి.
1. 'రియల్‌మి P3x 5G' స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz.
ప్రాసెసర్:కంపెనీ దీనిలో ప్రాసెసర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను అందించింది.
ఆపరేటింగ్ సిస్టమ్:ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్‌మీ UI 6 OS పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్: ఇది f/1.8 ఎపర్చరుతో 50MP OMNIVISION OV50D మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్‌లో సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా సెన్సార్ ఉంది.
బ్యాటరీ:రియల్‌మీ ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్:ఈ ఫోన్ దేశీయ మార్కెట్లో మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
- లూనార్ సిల్వర్
- మిడ్‌నైట్ బ్లూ
- స్టెల్లార్ పింక్
'రియల్‌మి P3x 5G' వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 128GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా ధరలు:
- 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 13,999
- 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 14,999
రియల్‌మీ P3x 5Gపై ఆఫర్:రియల్‌మీ ఈ P3x 5G స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.1000 తగ్గింపు ఇస్తోంది.
సేల్స్:దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి 28 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు.
2. 'రియల్‌మీ P3 Pro 5G' స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే:ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.