Realme GT 7 Pro:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను తీసుకొస్తోంది. రియల్మీ GT ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. దీంతో ఇది ఈ పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఇండియాలో లాంచ్ అవుతున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.
అంతేకాక ఈ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్లను కూడా అందించనున్నారు. ఈ ఫోన్ రిలీజ్‌పై గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తుండగా తాజాగా కంపెనీ దీని లాంచింగ్‌పై అధికారిక ప్రకటన చేసింది. ఈ నవంబర్ 26వ తేదీని ఈ స్మార్ట్ఫోన్ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రియల్మీ GT ప్రో ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
రియల్మీ GT ప్రో స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.78 అంగుళాలు
- రిఫ్రెష్ రేట్: 120Hz
- పీక్ బ్రైట్నెస్:6000 నిట్స్
- రిజల్యూషన్:2,780 x 1,264 పిక్సెల్స్
- బ్యాటరీ కెపాసిటీ: 6,500mAh
- ర్యామ్: 12GB
- స్టోరేజీ: 256GB
- రియర్ కెమెరా:50 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 50 మెగా పిక్సెల్
- 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
- OS: ఆండ్రాయిడ్
కెమెరా:ఈ ఫోన్లో 50 ఎంపీతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు.