తెలంగాణ

telangana

ETV Bharat / technology

కేంద్రం స్కీమ్​తో ఫ్రీ కరెంట్- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా! - PM Surya Ghar Muft Bijli Yojana - PM SURYA GHAR MUFT BIJLI YOJANA

PM Surya Ghar Muft Bijli Yojana: విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్యఘర్- ముఫ్త్​ బిజిలీ యోజన' పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు. సబ్సిడీ కూడా వస్తుంది. ఇంతకి ఏంటీ పథకం? ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? వంటి వివరాలు మీకోసం.

PM Surya Ghar Muft Bijli Yojana
PM Surya Ghar Muft Bijli Yojana (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 4:36 PM IST

Updated : Oct 2, 2024, 10:07 AM IST

PM Surya Ghar Muft Bijli Yojana: దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లలో ఫ్రీగా విద్యుత్ వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా కోటి గృహాల్లో సోలార్​ రూఫ్​టాప్​ సిస్టమ్​ను అమర్చుతారు. 'పీఎం సూర్యఘర్- ముఫ్త్​ బిజిలీ యోజన' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పొందొచ్చు. ఈ పథకం కింద రూ.75,021 కోట్లు కేటాయించారు. దీని ద్వారా ప్రజలు 78,000 రూపాయల వరకు సబ్సిడీ పొందొచ్చు.

Registration:

  • ఈ గ్రాంట్ పొందడానికి నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దీంతోపాటు ఈ పోర్టల్​లోనే సోలార్ రూఫ్ ఇన్​స్టాలేషన్​కు తగిన విక్రయదారులను కూడా ఎంచుకోవచ్చు.
  • ఇందుకోసం అధికారిక పోర్టల్​ https://www.pmsuryaghar.gov.in సైట్​కు వెళ్లాలి.
  • ఈ సైట్‌లో మీ స్టేట్ ఎంచుకుని మీ విద్యుత్ పంపిణీ సంస్థను పేర్కొనండి.
  • ఆపై మీ విద్యుత్ కస్టమర్ నంబర్, మొబైల్ నంబర్, E-mail ఐడీ నమోదు చేసుకోండి.
  • ఈ వివరాలను ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీ దరఖాస్తు రిజిస్టర్ అవుతుంది.

Login and Apply:

  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ కస్టమర్ నంబర్, మొబైల్​ నంబర్​ను ఉపయోగించి లాగిన్ చేయండి.
  • అందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ అప్లికేషన్ కన్పిస్తుంది. పూర్తి వివరాలను దరఖాస్తులో నింపి సబ్మిట్ చేయాలి.

Application Verification:

  • మీరు మీ దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత మీ స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) మీ అప్లికేషన్​ను ధృవీకరిస్తుంది.
  • ఆమోదం వచ్చేందుకు కొన్ని వారాల సమయం పడ్తుంది.
  • డిస్కం నుంచి ఈ స్కీమ్ ఆమోదం వచ్చేంత వరకు వేచి ఉండండి.

Installation of Solar Panels:

  • డిస్కం నుంచి ఆమోదం వచ్చాక మీ డిస్కమ్​లోని లిస్టెడ్ విక్రయదారుల నుంచి మాత్రమే సోలార్ ప్లాంట్‌ను మీ ఇంటిపై ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ గ్రాంట్ పొందాలంటే ఈ విక్రయదారుల నమోదు అవసరం.

Apply for Net Metering:

  • ఇన్‌స్టాలేషన్ పూర్తయినన తర్వాత మీ విద్యుత్ ప్లాంట్ వివరాలను పోర్టల్​లో నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీరు నెట్ మీటరింగ్ కోసం అప్లై చేసుకోవాలి.
  • ఈ డివైజ్ మీ సోలార్ ప్యానెల్​ల ద్వారా ఉత్పత్తి అయిన కరెంట్ అండ్ గ్రిడ్​ నుంచి వినియోగించే విద్యుత్​ను రికార్డ్ చేస్తుంది.
  • ఈ సెటప్​తో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్​ను డిస్కమ్​కు తిరిగి విక్రయించొచ్చు.
  • తద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు.

Subsidy Disbursement:

  • నెట్ మీటర్ ఇన్​స్టాల్ చేసిన తర్వాత డిస్కం అధికారులు చెక్ చేస్తారు.
  • ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత కమిషనింగ్ సర్టిఫికేట్​ను పోర్టల్ జారీ చేస్తుంది.
  • ఈ సర్టిఫికేట్ వచ్చాక మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సిల్ చేసిన చెక్​ను పోర్టల్​లో సబ్మిట్ చేయాలి.
  • దరఖాస్తుదారులు 3 kW వరకు రూఫ్​టాప్ సోలార్ సిస్టమ్​లను ఇన్​స్టాల్ చేయటానికి ఎటువంటి డౌన్ పేమెంట్ అవసరం లేకుండా7శాతం వరకు తక్కువ వడ్డీ రుణ ఉత్పత్తులను పొందొచ్చు.
  • అంటే 3 కిలోవాట్ల సిస్టమ్​కు రూ.78 వేల వరకు సబ్సిడీ ఉంటుంది.
  • ఈ సబ్సిడీ మొత్తం 30 రోజుల్లో నేరుగా మీ బ్యాంక్ అకౌంట్​లో పడుతుంది.

Benefits of The Scheme:

  • ఇది మీకు ఉచిత విద్యుత్​ను అందించడమే కాకుండా కరెంట్ బిల్లులపై మీకు డబ్బును కూడా ఆదా చేస్తుంది.
  • ఉదాహరణకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే గృహస్థులు 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను అమర్చడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ.15,000 ఆదా చేయవచ్చు.
  • అదనంగా ఈ పథకం 2 kW వరకు సిస్టమ్‌లకు 60% సబ్సిడీని, 2 నుంచి 3 kW మధ్య సిస్టమ్‌లకు 40% సబ్సిడీని అందిస్తుంది. ప్రారంభంలో మీ ఇంటిపై సెయిర్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
  • దీని కోసం తాకట్టు లేని రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train

అత్యధిక బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెంట్​తో స్మార్ట్​వాచ్!- ధర ఎంతంటే? - Redmi Watch 5 Lite Launched

Last Updated : Oct 2, 2024, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details