Paytm International UPI Payment: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్. పేటీఎం ఇంటర్నేషనల్ UPI పేమెంట్స్‌ను లాంచ్ చేసింది. దీంతో యూజర్స్ ఇప్పుడు విదేశాల్లో కూడా నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ మేరకు One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) కంపెనీ ఇప్పుడు విదేశాల్లోనూ పేటీఎం సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.
UPI రాకతో దేశంలో నగదు రహిత లావాదేవీలు సులభతం అయ్యాయి. ఎవరికైనా డబ్బు పంపించాలనుకుంటే ఈ సర్వీస్ సహాయంతో మొబైల్ ద్వారా ఈజీగా పంపించేస్తున్నారు. ఇలా ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్‌పైనే మొగ్గు చూపిస్తున్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. అయితే దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకోవడంలో పేటీఎం పాత్ర కూడా ఉంది.
ఈ క్రమంలో దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తాజాగా OCL.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌తో పాటు ఎంపిక చేసిన దేశాల్లో పేటీఎం యూజర్ల కోసం ఇంటర్నేషనల్ UPI పేమెంట్ సర్సీసులను ప్రారంభించింది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) అనేది పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ.
విదేశాల్లో పేటీఎం UPI పేమెంట్స్:
- OCL కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ సదుపాయంతో వినియోగదారులు ఇకపై పేటీఎం యాప్ ద్వారా UPIని ఉపయోగించి విదేశాల్లో చెల్లింపులు చేయొచ్చు.
- One97 కమ్యూనికేషన్స్ (OCL) అనేది ఇండియాలోని లీడింగ్ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.