తెలంగాణ

telangana

ETV Bharat / technology

'వివో X200 ప్రో మినీ'కి పోటీగా ఒప్పో నయా ఫోన్!- రిలీజ్ ఎప్పుడంటే?

త్వరలో మార్కెట్లోకి ఒప్పో ఫైండ్ X8 మినీ!- డీటెయిల్స్ లీక్

Oppo Find X8
Oppo Find X8 (Oppo India)

By ETV Bharat Tech Team

Published : Nov 3, 2024, 7:34 PM IST

Updated : Nov 4, 2024, 1:10 PM IST

Oppo Find X8 Mini: మార్కెట్లోకి త్వరలో ఒప్పో నుంచి సరికొత్త 'ఫైండ్ X8 మినీ' స్మార్ట్​ఫోన్ రానుంది. ఫైండ్ X8 అల్ట్రాతో పాటుగా దీన్ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్​సెట్ మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

టిప్‌స్టర్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఒప్పో కంపెనీ ఇటీవలే చైనాలో 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్​ను లాంచ్ చేసింది. ఈ సిరీస్​లో భాగంగా కంపెనీ కొత్త 'ఫైండ్ X8 అల్ట్రా' మోడల్‌ను ప్రకటించాలని భావిస్తోంది. అయితే ఒప్పో గత నెలలో చైనాలో ప్రారంభించిన 'వివో X200 ప్రో మినీ' స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడగల లైనప్‌లో నాల్గో మోడల్​ 'ఫైండ్ X8 మినీ' మొబైల్​ను కూడా సిద్ధం చేస్తున్నట్లు కన్పిస్తోంది.

టిప్​స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (ట్రాన్స్​లేటెడ్ ఫ్రమ్ చైనీస్) Weibo, చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని ఒక పోస్ట్‌లో.. ఒప్పో రాబోయే మరి కొన్ని నెలల్లో ప్రారంభించే 'ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా'తో పాటు మరో కొత్త స్మార్ట్​ఫోన్​పై పని చేస్తోందని పేర్కొంది. ఈ హ్యాండ్​సెట్​ ' ఒప్పో ఫైండ్ X8 మినీ' అని టిప్​స్టర్​ సూచిస్తోంది.

అయితే ఫైండ్ X8 అల్ట్రా, పుకార్లు షికారు చేస్తున్న 'ఫైండ్ X8 మినీ' గురించి ఒప్పో కంపెనీ మాత్రం ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు. అయితే ఈ ఫైండ్ X8 సిరీస్​లో నాల్గో మోడల్ లాంచ్ అయితే మాత్రం అది 'వివో X200 ప్రో మినీ'కి మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుంది.

వివో X200 ప్రో మినీ ఫీచర్స్: X200 ప్రో సిరీస్‌లో వివో అతి చిన్న మోడల్​లో MediaTek డైమెన్సిటీ 9400 చిప్ ఉంటుంది. ఇందులో గరిష్టంగా 16GB RAM ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది మూడు 50-మెగాపిక్సెల్ (ప్రైమరీ, అల్ట్రావైడ్ మరియు పెరిస్కోప్ టెలిఫోటో) కెమెరాలు, అలాగే 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

ఈ 'వివో X200 ప్రో మినీ'లో 1TB వరకు స్టోరేజీ పొందొచ్చు. ఇందులో 90W (వైర్డ్), 30W (వైర్‌లెస్) ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ కంపెనీ OriginOS 5 స్కిన్ పై రన్​ అవుతూ Android 15లో రన్ అవుతుంది.

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్- మీ వద్ద ఈ మోడల్ ఫోన్ ఉందా?- అయితే ఫ్రీ సర్వీస్​ ఆఫర్..!

షేర్​ 'లవ్' ఆన్ స్టేటస్- వాట్సాప్​లో ఈ క్రేజీ ఫీచర్ గమనించారా?

Last Updated : Nov 4, 2024, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details