తెలంగాణ

telangana

ETV Bharat / technology

చాట్​జీపీటీలో కొత్త ఏఐ టూల్- ఇది డీప్​సీక్​కు చెక్​ పెట్టనుందా? - CHATGPT DEEP RESEARCH FEATURE

డీప్​సీక్ ధాటికి ఓపెన్ ఏఐ 'డీప్​ రీసెర్చ్'- ఈ ఫీచర్​ను ఎలా ఉపయోగించాలంటే?

ChatGPT
ChatGPT (Photo Credit- ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Feb 4, 2025, 2:39 PM IST

Updated : Feb 4, 2025, 2:49 PM IST

ChatGPT Deep Research Feature:టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచం అంతా ఏఐ వెంట పరుగులు పెడుతోంది. దీంతో అన్ని కంపెనీలు ఏఐపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఓపెన్​ఏఐ సంస్థ చాట్​జీపీటీ అనే ఏఐ ఆధారిత చాట్​బాట్​ను లాంఛ్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు చైనీస్ స్టార్టప్​ కంపెనీ డీప్​సీక్​ నుంచి వచ్చిన R1 మోడల్ ఊహించని ప్రజాదరణతో మొత్తం టెక్ ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది.

దీన్ని ఉపయోగించిన వారు ఇతర ఏఐ మోడల్స్​ కంటే ఇది మెరుగైన పనితీరును కనబరుస్తోందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇంత అడ్వాన్స్​డ్ ఏఐ మోడల్​ను పూర్తిగా ఉచితంగా అందించడంతో విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో చాట్​బాట్ఏఐరంగంలో ఓపెన్ఏఐ తన చాట్​జీపీటీ స్థానాన్ని మళ్లీ మునుపటిలా నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చాట్​జీపీటీలో 'డీప్​ రీసెర్చ్​' పేరుతో కొత్త ఫీచర్​ను జోడించింది.

ఈ ఫీచర్​ ఎంత కష్టమైన టాస్క్​ను అయినా మల్టీ-స్టెప్​ సెర్చ్​ నిర్వహించగలదు. అంటే ఎంత డీప్ రీసెర్చ్​ గురించైనా ఓ విశ్లేషకుడి స్థాయిలో పరిశోధించి కేవలం 10 నిమిషాల్లోనే సమాచారాన్ని అందించగలదని ఓపెన్​ఏఐ చెబుతోంది. ఇదే టాస్క్​ను పూర్తి చేసేందుకు మానవులకు అయితే చాలా గంటలు పడుతుందని పేర్కొంది.

ఏంటీ డీప్ రీసెర్చ్ ఫీచర్​?: వాస్తవానికి ఓపెన్​ఏఐ తీసుకొచ్చిన ఈ ఫీచర్​ చాట్​జీపీటీ లేటెస్ట్ ఏజెంట్. ఇది అత్యంత కష్టతరమైన ఏదైనా టాస్క్​ను క్షణాల్లో అంటే చాలా తక్కువ సమయంలోనే చేయగలదు. ఇందుకోసం మీరు మీ డిఫికల్ట్ టాస్క్​ కోసం ప్రాంప్ట్​ను ఎంటర్ చేస్తే చాలు. అది వెంటనే అనేక ఆన్​లైన్​ సోర్సెస్​ నుంచి సమాచారాన్ని తీసుకుని దాన్ని నిపుణుల స్థాయిలో సవరణలు, విశ్లేషణలు చేసి నాణ్యతతో కూడిన నివేదికలను రూపొందించి మీకు అందిస్తుంది. ఇలా ఇది పరిశోధనలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో మీకు సమహాయపడుతుంది.

ఈ డీప్​ రీసెర్చ్​ ఫీచర్​ ఓపెన్​ఏఐ O3 మోడల్ ద్వారా తీసుకొచ్చారు. వెబ్ బ్రౌజింగ్ అండ్ డేటా క్రంచింగ్ కోసం చాట్​జీపీటీ ఈ కొత్త ఏజెంట్​ను కంపెనీ రూపొందించింది. రీజనింగ్‌ని ఉపయోగించి ఇంటర్నెట్‌లో చాలా టెక్స్ట్, పిక్చర్స్, PDFలను శోధించి, అర్థం చేసుకుని, విశ్లేషించగల సామర్థ్యం దీనికి ఉంది. కొత్త నాలెడ్జ్​ను అందించాలంటే జ్ఞానాన్ని సంశ్లేషణ చేయడం అవసరమని కంపెనీ చెబుతోంది. ఇందుకు డీప్​సీక్​ రీసెర్చ్​ తమకు ఒక ముఖ్యమైన అడుగు అని, దీని ద్వారా AGI (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్)ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

ఈ డీప్​ రీసెర్చ్ ఫీచర్​ను ఎలా ఉపయోగించాలి?:చాట్​జీపీటీ మెసెజ్ కంపోజర్​లో ఈ కొత్త డీప్ రీసెర్చ్ ఫీచర్​ ఆప్షన్​ కన్పిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీరు ఎలాంటి ప్రశ్నలను అయినా అడొగొచ్చు. అంతేకాక మీరు గూగుల్​ స్ప్రెడ్‌షీట్‌లను కూడా మీ ప్రశ్నలో చేర్చవచ్చు. ఆ తర్వాత చాట్​జీపీటీలోని ఈ డీప్​ రీసెర్చ్​ ఏజెంట్ ఆన్​లైన్ నాలెడ్జ్​ను ఉపయోగించి మీరు అడిగిన ప్రశ్నను పరిశోధించి విశ్లేషిస్తుంది. ఈ ఫీచర్​ ముఖ్యంగా ఫైనాన్స్, సైన్స్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్​ కోసం పనిచేసే వారికి బాగా ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

OpenAI Launches Deep Research Agent in ChatGPT (Photo Credit- OpenAI)

అంతేకాక ఈ ఏజెంట్ మీకు హెల్పింగ్ సైడ్​బార్​ను కూడా చూపిస్తుంది. ఇందులో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఈ డీప్​ రీసెర్చ్​ ఫీచర్​ ఏ స్టెప్స్​ తీసుకుందో, ఏ సోర్సెస్​ను ఉపయోగించిందో కన్పిస్తుంది. తమకు ట్రాన్సపరెన్సీ ముఖ్యమని కంపెనీ చెబుతోంది. అయితే డీప్​ రీసెర్చ్​ ద్వారా చేసే పరిశోధనకు నిర్ణీత కాలపరిమితి లేదు. ఇది మనం అడిగిన ప్రశ్నను బట్టి దానిపై పరిశోధించి సమాధానం ఇచ్చేందుకు 5 నుంచి 30 నిమిషాల సమయం తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్​ చాట్​జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

బాల్యం నుంచే స్మార్ట్​ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!

ఒకటికి మించి మరొకటి- పోటాపోటీ ఫీచర్లతో లాంఛ్​కు రెడీగా కిర్రాక్ స్మార్ట్​ఫోన్లు!

ఇండియన్ రైల్వే సూపర్ యాప్ వచ్చేసిందోచ్- ఇకపై ఒక్క క్లిక్​తోనే టికెట్ బుకింగ్​తో పాటు అన్ని సేవలు!

Last Updated : Feb 4, 2025, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details