తెలంగాణ

telangana

ETV Bharat / technology

భారత్​లో 5.5G వచ్చేసిందోచ్- ఇకపై ఎక్కడ ఉన్నా సూపర్​ ఫాస్ట్ నెట్​వర్క్!- ఇది ఏ డివైజ్​లో పనిచేస్తుందంటే? - ONEPLUS 13 WITH 5G ADVANCED NETWORK

ఇండియాలో 5.5Gతో వచ్చిన ఫస్ట్ స్మార్ట్​ఫోన్​గా వన్​ప్లస్ 13- ఏంటీ నెట్​వర్క్? దీని ఉపయోగాలేంటి?

OnePlus 13 Became India's First Phone to Come with 5.5G Network
OnePlus 13 Became India's First Phone to Come with 5.5G Network (Photo Credit- OnePlus)

By ETV Bharat Tech Team

Published : Jan 8, 2025, 8:11 PM IST

Updated : 12 hours ago

Oneplus 13 Launched with 5.5G Network: వన్​ప్లస్​ జనవరి 7న తన ఫ్లాగ్​షిప్ లైనప్​ కొత్త స్మార్ట్​ఫోన్ సిరీస్​ను ఇండియన్ మార్కెట్లో ప్రారంభించింది. ఈ సిరీస్​లో కంపెనీ వన్​ప్లస్​ 13, వన్​ప్లస్​ 13R పేర్లతో రెండు స్మార్ట్​ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండింటిలో ఏఐ ఫీచర్లు, క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​సెట్​, కొత్త Silicon NanoStack బ్యాటరీ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

వీటన్నింటితో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వన్​ప్లస్​ 13లో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ఇండియాలో జియో సహకారంతో 5.5G (అడ్వాన్స్​డ్ 5G) నెట్​వర్క్​ సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో ఈ స్మార్ట్​ఫోన్ దేశంలో ఈ నెట్​వర్క్​తో వస్తున్న మొట్ట మొదటి డివైజ్​గా అవతరించింది.

ఈ లాంఛ్​ ఈవెంట్ సందర్భంగావన్​ప్లస్​ సీనియర్ గ్లోబల్ PR మేనేజర్ జేమ్స్ ప్యాటర్సన్ ఈ లేటెస్ట్ 5.5G టెక్నాలజీపై మాట్లాడారు. ఈ అధునాతన నెట్​వర్క్ వన్​ప్లస్​ 13 సిరీస్ డివైజ్​లను ఒకేసారి మూడు వేర్వేరు నెట్​వర్క్ సెల్స్​కు (డిఫరెంట్ టవర్ల నుంచి కూడా) కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుందని తెలిపారు. ఇది కనెక్టివిటీని వేగవంతం చేయడంతో పాటు ఓవరాల్ పెర్ఫార్మెన్స్​ను కూడా మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఏంటీ 5.5G నెట్‌వర్క్?: 5.5G నెట్‌వర్క్‌ని 5G అడ్వాన్స్‌డ్ అని కూడా పిలుస్తారు. ఇది 5G టెక్నాలజీకి తదుపరి దశ. 5Gతో పోలిస్తే ఇది మెరుగైన వేగం, తక్కువ జాప్యం (ఆలస్యం), బెటర్ నెట్‌వర్క్ రిలయబిలిటీ (నెట్‌వర్క్ విశ్వసనీయత), ఎక్స్​పెన్డెడ్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెంట్ సిస్టమ్స్) వంటి కొత్త మెరుగైన ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది. 5.5G నెట్​వర్క్​ గురించి సింపుల్​గా చెప్పాలంటే, ఇది 5G నెట్‌వర్క్ కంటే ఒక అడుగు ముందుంది. ఇది వినియోగదారుల నెట్‌వర్క్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

5.5G కమర్షియల్ రోల్​అవుట్ రిలీజ్ 18తో ప్రారంభమైంది. దీన్ని ఈ అధునాతన టెక్నాలజీ ఫస్ట్ స్టెప్​గా పరిగణిస్తారు. ఎరిక్సన్ అందించిన సమాచారం ప్రకారం.. దీన్ని ప్రీవియస్ 15, 16, 17 రిలీజ్​ల ఆధారంగా రూపొందించారు. ఈ 5.5G నెట్​వర్క్ రిలీజ్ 21తో మరింత మెరుగ్గా వస్తుందని తెలుస్తోంది. దీన్ని 2028 నాటికి పరిచయం చేయనున్నట్లు భావిస్తున్నారు.

5.5G నెట్‌వర్క్ లేదా 5G అడ్వాన్స్ ప్రయోజనాలు:

  • 5.5G నెట్‌వర్క్ వినియోగదారులకు 5G కంటే వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది.
  • 5.5G నెట్‌వర్క్ సహాయంతో వినియోగదారులు తక్కువ సమయంలోనే డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
  • 5.5G నెట్‌వర్క్ అనేది 5G కంటే మెరుగైన కనెక్టివిటీ అండ్ నెట్‌వర్క్‌ని అందిస్తుంది.
  • 5.5G నెట్‌వర్క్ సహాయంతో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ ఫోన్‌ సిగ్నల్ ఎప్పుడూ స్ట్రాంగ్​గా ఉంటుంది.
  • స్మార్ట్ సాఫ్ట్‌వేర్ 5.5G నెట్‌వర్క్‌లో కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెట్‌వర్క్ మునుపటి కంటే మరింత స్మార్ట్​గా మారనుంది.

వన్​ప్లస్ 13 vs ఐకూ 13- వీటిలో ది బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఏది?- డిజైన్ నుంచి ధర వరకు పూర్తి వివరాలివే!

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 మోడల్స్​- పిచ్చెక్కించే డిజైన్లతో బైక్స్​ను దింపుతున్న డుకాటి!

ఎంజీ విండ్సార్ ఈవీ ధరల పెంపు- ఫ్రీ ఛార్జింగ్​ ఫెసిలిటీకి కూడా గుడ్​బై

Last Updated : 12 hours ago

ABOUT THE AUTHOR

...view details