తెలంగాణ

telangana

ETV Bharat / technology

యూత్​ఫుల్ లుక్​లో బజాజ్ పల్సర్​ N125- రిలీజ్ ఎప్పుడంటే?

బజాజ్​ నుంచి మరో కొత్త బైక్- త్వరలో మార్కెట్లోకి పల్సర్​ N125..!

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

New Bajaj Pulsar N125
New Bajaj Pulsar N125 (Instagram/mypulsarofficial)

New Bajaj Pulsar N125: స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రొడక్ట్స్​లో పల్సర్​ మోడల్స్​ క్రేజ్​ వేరే లెవల్. దానికి తగ్గట్టుగానే కంపెనీ కూడా పాత మోడల్స్​ను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మార్కెట్లోకి మరో కొత్త పల్సర్​ బైక్​ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బైక్‌ను తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపినప్పటికీ దీని రిలీజ్ డేట్​ను ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ఈ బైక్​కు సంబంధించిన ధర, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. ఈ సందర్భంగా ఈ బజాజ్​ పల్సర్​ ఎన్​125 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాల గురించి తెలుసుకుందాం రండి.

ఈ కొత్త బజాజ్ పల్సర్​ N125 విలక్షణమైన అగ్రెసివ్ పల్సర్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. దీనిలో సరికొత్త LED హెడ్‌లైట్ యూనిట్, ముందుభాగంలో చాలా ప్లాస్టిక్ క్లాడింగ్​ను అమర్చారు. ఈ మోటార్‌సైకిల్‌లో ఫోర్క్ కవర్, హెడ్‌లైట్ చుట్టూ ఉన్న ప్యానెల్​ను ప్లాస్టిక్​తో కవర్ చేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే హెడ్​లైట్​ చుట్టూ ఉన్న ప్లాస్టిక్​ ప్యానెల్​ మీకు కావాల్సిన షేడ్​ను బట్టి అనేక కలర్ ఆప్షన్స్​లో అందిస్తారు.

ఈ కొత్త బజాజ్ పల్సర్ N125 చక్రాలు.. పెద్ద పల్సర్​ N150కి సమానంగా ఉంటాయి. దీని డిస్​ప్లే, ఇండికేటర్స్ బజాజ్ ఇటీవల రిలీజ్ చేసిన ఫ్రీడమ్ 125 CNG మాదిరిగానే ఉంటాయి. అంటే బజాజ్ పల్సర్ N125ని బేసిక్ బ్లూటూత్​ ఫంక్షనాలిటీతో తీసుకునిరావొచ్చు. యూత్​కి తగ్గట్టుగా ఈ పల్సర్ N125లో సైడ్ ప్యానెల్స్, టెయిల్ విభాగంలో కొన్ని కొత్త గ్రాఫిక్స్​తో తీసుకుని రానున్నారు. TVS రైడర్, Hero Xtreme 125R లాగానే ఈ కొత్త పల్సర్ N125 కూడా స్ప్లిట్ సీట్లు ఉంటాయి.

బజాజ్ పల్సర్ N125 ధర ఎంతంటే?: ఈ కొత్త బజాజ్ పల్సర్ N125 ధర మార్కెట్లో దీని ప్రత్యర్థులైన హీరో, TVSల మాదిరిగానే ఉంటుందని అంచనా. అంటే దీని ధర సుమారు రూ. 90,000 నుంచి రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చు.

కొత్త చీఫ్​ టెక్నాలజిస్ట్​ను నియమించిన గూగుల్- ఆయన ఎవరో తెలుసా?

గూగుల్​ పిక్సెల్ 9ప్రో సేల్స్ ప్రారంభం- ధర, ఫీచర్లు ఇవే..!

ABOUT THE AUTHOR

...view details