Mobile Battery Health Check :ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండటం అనేది సర్వసాధారణం. అంతే కాకుండా ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో అన్ని చెల్లింపులు ఫోన్ ద్వారానే చేస్తుంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు మన ఫోన్లో తరచుగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. ( Mobile Battery Draining Fast ) అప్పుడు మనం కంగారు పడి బ్యాటరీ లైఫ్ టైమ్ అయిపోయిందనుకుంటాం. కొత్త ఫోన్ కొనటమే బ్యాటరీ మార్చటమో చేస్తుంటాం. అయితే చాలా వరకూ మనం వినియోగించని యాప్‌లు ఫోన్లో ఉండటం లేదా అనవసర సెట్టింగ్‌ల వలనే మన ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంటుంది. ఇక్కడ మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేసే కొన్ని చిట్కాలు.
1.బ్యాటరీ సెట్టింగ్ ఆప్షన్ చూసుకోండి.
ఆండ్రాయిడ్ ఫోన్లను వివిధ రకాల కంపెనీలు తయారుచేస్తాయి. ప్రతి కంపెనీ తన ఆపరేటింగ్ సిస్టమ్‌ను తన అనుగుణంగా తయారు చేస్తారు. కాబట్టి, మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లగానే మీ బ్యాటరీ ఆప్షన్ మెుదటగా ఉందా లేదా చూడండి.
2.ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నారు?
సెట్టింగ్స్‌లో మీ బ్యాటరీ ఎంత ఉంది అనేది మాత్రమే కాకుండా, దానిని ఎంత సేపు ఛార్జింగ్ చేయాలి అనే విషయాన్ని గమనించాలి. దీని ద్వారా మీ బ్యాటరీని ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుస్తుంది.
3.బ్యాటరీ హిస్టరీ
చాలా మంది తమ ఫోన్‌ను రోజూ ఒకే విధంగా ఉపయోగిస్తారు. అందుకే బ్యాటరీ హిస్టరీ చెక్ చేయటం వల్ల ఎందుకు ఛార్జింగ్ త్వరగా అయిపోతోందో తెలుస్తుంది.
4.యాప్‌ల వినియోగాన్ని గమనించండి.
కొన్ని యాప్స్ గ్రాఫిక్స్, గేమ్స్‌కు సంబంధించినవి ఉంటాయి. అవి సాధారణ వాటితో పోల్చితే ఎక్కువగా ఛార్జింగ్‌ను తీసుకుంటాయి. కాబట్టి ఫోన్ల యాప్‌ల వినియోగాన్ని గమనించండి. మీకు అవసరమైనవి లేకుంటే వాటిని డిలీట్ చేయండి.
5.వాటిని డిలీట్ చేయండి.
మీ ఫోన్లో ఉన్న యాప్‌లలో ఏది ఎక్కువ ఛార్జింగ్ తీసుకుంటుందో గమనించండి. ఒకవేళ ఆ యాప్ అవసరం మీకు లేకుంటే దానిని మీఫోన్ నుంచి తొలగించండి.