Mercedes Benz EQS 450:లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎలక్ట్రిక్ SUVని లాంఛ్ చేసేందుకు రెడీ అయింది. 'మెర్సిడెస్ బెంజ్ EQS 450' పేరుతో దీన్ని రిలీజ్ చేయనుంది. దీనితోపాటు కంపెనీ 'మెర్సిడెస్-బెంజ్ G 580'ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కంపెనీ EQ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న కంపెనీ ఈ రెండు కార్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
మెర్సిడెస్ బెంజ్ 'EQS 450' స్పెసిఫికేషన్‌లు:ఈ 'EQS 450' SUV అనేది కంపెనీ లైనప్‌లో రెండో వేరియంట్ (మేబ్యాక్ మినహా). ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. 7-సీటర్ 'EQS 580 4మ్యాటిక్' SUVలో ఉపయోగించిన అదే 122kWh బ్యాటరీ ప్యాక్‌తోనే ఈ కారును కూడా తీసుకురానున్నారు.
'EQS 450 స్పెషాలిటీ:దీని స్పెషాలిటీ ఏంటంటే..ఇది ఇప్పటివరకు దేశంలో ఏ ప్యాసింజర్ EVకిలేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో వస్తుంది. ఈ కారును 200kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు.
ఎక్స్టీరియర్: దీని ఎంట్రీ-లెవల్ EQS SUV కొంగొంత్త డిజైన్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ బంపర్ లోవర్ పార్ట్ వరకూ బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్‌తో ఉంటుంది. దీని మొత్తం డైనమిక్ సిల్హౌట్ 'EQS 580'ని పోలి ఉంటుంది. అయితే ఇది రిఫ్రెష్డ్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఇంటీరియర్: దీని ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని క్యాబిన్లో క్రాఫ్టెడ్ కవర్‌లతో సీట్లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఇందులో ఎనర్జైజింగ్ ఎయిర్ కంట్రోల్ ప్లస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారులో 56-అంగుళాల హైపర్‌స్క్రీన్ సెటప్, 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్, 17.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను అమర్చారు.