Kia Cars Launched in India:దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ భారత్‌లో రెండు విలాసవంతమైన కార్లను లాంచ్ చేసింది. వీటిల్లో విద్యుత్తు ఆధారంగా పనిచేసే ఈవీ9 SUVని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక ఇప్పటికే భారత మార్కెట్‌కు సుపరిచితమైన కియా కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పలు అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ కార్లపై మరిన్ని వివరాలు మీకోసం.
భారత్‌కు 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024':
- వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఈ ఏడాది కియా ఈవీ9 నిలిచింది. ఆకర్షణీయమైన బాక్సీ షేప్‌లో దీనిని తీర్చిదిద్దారు. ముందువైపు డిజిటల్ టైగర్ ఫేస్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. ఈ సరికొత్త కారుకు స్లీక్ LED హెడ్‌లైట్స్, స్టార్‌మ్యాప్ LED అసెంట్స్ అదనపు ఆకర్షణలు తెచ్చాయి.
- ఈ ఈవీ9 కారు 350 కేవీ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 10-80శాతం ఛార్జింగ్ కేవలం 24 నిమిషాల్లో పూర్తి చేసుకోగలదు.
- 5.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. 700 టార్క్ వద్ద ఈ కారు మొత్తంలో 282.6 కిలోవాట్స్ పవర్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. 198 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ దీని సొంతం.
కియా కనెక్ట్ 2.0 సిస్టమ్: ఈ కారులో కియా కనెక్ట్ 2.0 సిస్టమ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్ అయి ఇది రియల్‌టైమ్ అప్‌డేట్స్, రిమోట్ కంట్రోల్ ఫీచర్‌ను అందిస్తుంది. ఈవీ9 కారులోని 44 కంట్రోలర్స్‌ను రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ ఆధారంగా పనిచేసే డిజిటల్ కీ 2.0 వెర్షన్ ఈ కారుకు అమర్చారు.
భద్రతా ఫీచర్లు:
- 24 అటానమస్ అడాస్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.
- 10 ఎయిర్ బ్యాగ్‌లు ఈ కారుకు ఉన్నాయి.
- యూరోఎన్‌క్యాప్, ఏఎన్‌క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.
ఇతర ఫీచర్లు:
- 12.3 హెచ్‌డీ డిస్‌ప్లే ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్
- అత్యాధునిక ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే
- 5 అంగుళాల హెచ్‌డీ హెచ్‌వీఏసీ స్క్రీన్
- 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్మెంట్ సిస్టమ్
కియా ఈవీ9 ధర: రూ.1.3 కోట్లు (ఎక్స్‌షోరూమ్)
లగ్జరీ ప్యాకేజీగా 'కార్నివాల్' సెకండ్ ఇన్నింగ్స్:
- సరికొత్త హంగులతో కియా కార్నివాల్ ఇండియన్ కస్టమర్లను మరోసారి పలకరించింది.
- ఈ సారి ఈ కారులో అన్ని ఫీచర్లతో కలిసి లిమోసిన్ ప్లస్ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చారు.
- ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో దీనికి పోటీనే లేదు.
- ఈ సరికొత్త కార్నివాల్‌కు తాజాగా 24 గంటల్లోనే 1,822 బుకింగ్స్ రావడం విశేషం.
ఇంజిన్:ఈ కారులో స్మార్ట్ స్ట్రామ్ 2.2 లీటర్స్ 4 సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 193 పీఎస్ పవర్, 441 టార్క్‌ను రిలీజ్ చేయగలదు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను దీనికి జతచేశారు. ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్, స్మార్ట్ డ్రైవ్‌మోడ్స్ ఉన్నాయి. ఈ లిమోసిన్ 5,155 ఎంఎం పొడవు, 1,995 ఎంఎం వెడల్పు, 1,775 ఎత్తుతో భారీగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో 2+2+3 సిటింగ్ ఉంది.