iPhone Unknown Pro Tips :మీరు ఐఫోన్ యుజర్లా? అందులో ఉన్న కొన్ని హిడెన్ ఫీచర్స్ గురించి మీకు తెలుసా? అయితే ఈ ఫీచర్స్ కేవలం కొత్తగా వచ్చిన ఐఫోన్ 15 సిరీస్‌లో మాత్రమే కాకుండా పాత డివైజుల్లోనూ పనిచేస్తాయి. మరి ఆ హిడెన్ ఫీచర్స్ ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
- బటన్ నొక్కితే కెమెరా ఆన్
ఐఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెప్పాలంటే చాలా మంది కెమెరా కోసమే యాపిల్ ఫోన్లను కొంటుంటారు. ఐఫోన్ ద్వారా ఏదైనా ఫొటో క్లిక్ చేద్దామన్నా లేదా ఏమైనా వీడియో రికార్డ్ చేయాలన్నా, ఫోన్ లాక్ ఓపెన్ చేసి కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేస్తుంటారు. కానీ, అంత ప్రాసెస్‌లోకి వెళ్లకుండానే కేవలం ఒక్క చిన్న టిప్‌తో కొన్ని మిల్లిసెకెన్లలో మీ కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఇందుకోసం కేవలం షట్టర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే చాలు. ఆటోమెటిగ్గా వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది - ఫ్లాష్‌లైట్ ఆన్ అండ్ ఆఫ్
సాధారణంగా ఐఫోన్లలో ఫ్లాష్‌లైట్ ఆన్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ సింబల్ కూడా ఉంటుంది. చాలామంది దీనిని వినియోగించే లైట్‌ను ఆన్-ఆఫ్ చేస్తారు. అయితే ఐఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ టూల్ 'Siri' ఫీచర్ సాయంతో ఫ్లాష్‌లైట్‌ను చిటికెలో ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. కేవలం 'Siri, Lumos' అంటే లైట్ ఆన్ అవుతుంది, 'Siri, nox' అంటే ఫ్లాష్‌లైట్ ఆఫ్ అవుతుంది. - హార్డ్ రీసెట్ చేయండి
ఐఫోన్ కొన్ని సార్లు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దానిని రీసెట్ చేయాల్సి వస్తుంది. దీని కోసం వాల్యూమ్ అప్ బటన్‌ను నొక్కి వదిలేయండి. ఆ తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్‌ను కూడా అలానే చేయండి. ఆపై సైడ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి. ఇలా మీ ఫోన్ మొత్తం షట్‌డౌన్ అయ్యేంత వరకు చేయండి. కొద్దిసేపటి తర్వాత దానిని ఆన్ చేయండి. దీనితో మీ ఫోన్ సెట్ అవుతుంది. ఈ ట్రిక్ ఐఫోన్ 10 నుంచి ఐఫోన్ 15 సరీస్ ఫోన్లకు వర్కౌట్ అవుతుంది. - వన్ హ్యాండెడ్ కీబోర్డ్
ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో రెండు చేతులను ఉపయోగించకుండా మెసేజ్‌ను టైప్ చేయడం కష్టం. దీనిని దృష్టిలో ఉంచుకొని యాపిల్ మీ మొబైల్‌కు చక్కని రీచెబులిటీ ఫీచర్‌ను జోడించింది. అదే వన్ హ్యాండెడ్ కీబోర్డ్. దీని సాయంతో కేవలం ఒక్క చేత్తో మీరు సందేశాన్ని టైప్ చేయవచ్చు. ఇందుకోసం ఫోన్ కీ-బోర్డ్‌లోని ఎమోజీ సింబల్‌ను నొక్కి పట్టుకోండి. ఆ తర్వాత మీరు కీ-బోర్డును స్క్రీన్కు కుడివైపునా లేదా ఎడమవైపుకు మార్చుకోవచ్చు. తద్వారా మీరు ఒంటి చేత్తో మెసేజ్‌ను టైప్ చేయవచ్చు. - షేకింగ్ మెసేజ్‌లు
మామూలుగా మీరు ఏదైనా ఒక పదాన్ని తప్పుగా టైప్ చేసి దానిని డిలీట్ చేసేందుకు బ్యాక్‌స్పేస్ బటన్‌ను క్లిక్ చేస్తారు. దానికి బదులుగా ఐఫోన్‌లోని షేకింగ్ మెసేజ్ ఫీచర్‌తో బ్యాక్‌స్పేస్ ఎంటర్ చేయకుండానే మీరు రాసిన తప్పు పదం స్క్రీన్‌పై నుంచి తొలగిపోతుంది. ఇందుకోసం మీరు మీ గ్యాడ్జెట్‌ను ఒకసారి షేక్ చేస్తే మీరు టైప్ చేసిన పదం డిలీట్ అయిపోతుంది. మీరు మరలా ఫోన్‌ను షేక్ చేస్తే అదే పదం రీ-యాడ్ అవుతుంది. - బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్
సాధారణంగా చాలామంది యాపిల్ ఫోన్లోని బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్‌ను వింటూ రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడారు. మీరు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయాలని అనుకుంటే, కంట్రోల్ సెంటర్‌ను ఓపెన్ చేసి ఇయర్ ఐకాన్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. దీంతో వివిధ రకాల బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్‌ను మీరు వినగలుగుతారు. - సులభంగా స్టిక్కర్‌లను క్రియేట్ చేయండి
ఐఫోన్‌లోని క్రియేట్ స్టిక్కర్ ఫీచర్‌ను ఉపయోగించి మీకు నచ్చిన ఫొటోను స్టికర్ రూపంలో మార్చుకోవచ్చు. iOS 17 ఇన్‌స్టాల్ చేసిన డివైజ్‌లలో Messages ఆప్షన్‌కు వెళ్లి '+' ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత స్టికర్స్‌పై క్లిక్ చేయండి. అనంతరం మళ్లీ '+' సింబల్‌ను నొక్కండి. తర్వాత మీరు స్టికర్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. - ఆటోమేటిక్ ఫోకస్ మోడ్స్
ఫోకస్ మోడ్ ఫీచర్ సాయంతో మీ ఐఫోన్ వినియోగాన్ని నియంత్రించవచ్చు. దీనిని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీరు అతిగా ఫోన్ చూస్తున్నా, రాత్రుళ్లు నిద్ర మానేసి మరీ అందులోనే గడుపుతున్నా ఓ అలర్ట్ మెసేజ్ లాంటిది మీకు వస్తుంది. దీనిని ఈ ఆటోమేటిక్ ఫోకస్ మోడ్ ఫీచర్ పంపిస్తుంది. తద్వారా మీరు మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు.