Hyundai Records in CNG Car Sales: హ్యుందాయ్ మోటార్ ఇండియా CNG కార్లు సేల్స్‌లో అదరగొట్టాయి. ఇది వరకూ లేని విధంగా వీటి సేల్స్ అక్టోబర్ నెలలో గణనీయంగా పెరిగాయి. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఎక్స్‌టర్, ఆరా, నియోస్ కార్లు రికార్డు స్థాయిలో మంచి సేల్స్‌ని రాబట్టాయి.
దీనికి కారణం ఈ సెగ్మెంట్‌లో డిమాండ్‌తో పాటు కంపెనీ ఎంట్రీ-లెవల్ CNG మోడల్‌ల పోర్ట్‌ఫోలియో కూడా. కంపెనీ ఇటీవలే గ్రాండ్ i10 నియోస్, ఎక్సెటర్‌లలో డ్యూయల్ CNG సిలిండర్ సెటప్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత రెండు మోడల్స్ సేల్స్ భారీ స్థాయిలో నమోదు చేసుకున్నాయి. ఎందుకంటే ఇది మెరుగైన బూట్ స్పేస్, అధిక ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
గ్రాండ్ i10, ఎక్సెటర్ మాత్రమే కాకుండా, హ్యుందాయ్ కంపెనీ.. తన ఆరాను CNG పవర్‌ట్రైన్‌తో అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) హ్యుందాయ్ సేల్స్ వాల్యూమ్‌లో CNG మోడల్స్ 12.8% వాటాను కలిగి ఉన్నాయి. పుణే, దిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో హ్యుందాయ్ CNG మోడల్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో CNG వాహనాల వాటా 11.4%. గ్రామీణ మార్కెట్లలో వాటి వాటా గత కొద్ది సంవత్సరాల్లోనే 12%కి అనూహ్యంగా వేగంగా పెరిగింది. అయితే పట్టణ మార్కెట్లలో దీని వాటా 10.7% మాత్రమే.