తెలంగాణ

telangana

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

ETV Bharat / technology

కారు ఓనర్​కు రూ.16.95 లక్షలు చెల్లించాల్సిందే!- టాటా మోటార్స్‌కు కోర్టు ఆదేశం - Hyderabad Nexon EV Fire Case

Hyderabad Nexon EV Fire Case: టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగిన కేసులో వినియోగదారుల కోర్టు టాటా మోటార్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 16.95 లక్షలను కారు ఓనర్​కు తిరిగి ఇవ్వాలని టాటా మోటార్స్‌ను కోర్టు ఆదేశించింది. అసలేం జరిగిందంటే?

Hyderabad Nexon EV Fire Case
Hyderabad Nexon EV Fire Case ('X' Social Media)

Hyderabad Nexon EV Fire Case: టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగిన కేసులో హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టులో టాటా మోటార్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కారు ఓనర్​కు కారు పూర్తి ధరను వాపసు చేయాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం:

  • జోనాథన్ బ్రైనెర్డ్ అనే వ్యక్తి టాటా మోటార్స్​కు చెందిన పాపులర్, అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్​ను 2022లో కొనుగోలు చేశారు.
  • అయితే అది కొన్న కొన్ని నెలలకే కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించి కారులో మంటలు చెలరేగాయి.
  • ఆ సమయంలో తాను తన కారును గంటకు 38 కి.మీ తక్కువ వేగంతోనే డ్రైవింగ్ చేస్తున్నట్లు బ్రైనెర్డ్ తెలిపారు.
  • 2023 జూన్ 1న జరిగిన ఈ ఘటనలో కారు కాలిపోయింది.
  • వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
  • మంటలు వేగంగా వ్యాపించడంతో కారు డోర్లు జామ్‌ అయ్యాయి.
  • ఆ సమయంలో ఆయన సైడ్ డోర్​ నుంచి బయటికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు.
  • ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా కూడా మారింది.
  • ఈ ఘటన తర్వాత బ్రెయినార్డ్ వినియోగదారుల కోర్టులో టాటా మోటార్స్‌పై కేసు వేశారు.
  • సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగిందని కారు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Early Battery Discharge:

  • కారు బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందని బ్రైనర్డ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • అదే సమయంలో కారును 18 శాతం ఛార్జ్ చేసిన తర్వాత కూడా అది స్టార్ట్ కాలేదన్నారు.
  • ఆయన కారును సర్వీస్ సెంటర్​లో చూపించగా మొదట కారు హెచ్‌వి బ్యాటరీ చెడిపోయిందని చెప్పినట్లు తెలిపారు.
  • అయితే కొత్త బ్యాటరీని అమర్చకుండా పాత రీఫర్బిష్డ్ బ్యాటరీని కారులో అమర్చారని కారు ఓనర్ ఆరోపించారు.

రూ. 16.95 లక్షలు వాపసు ఇవ్వాలని ఆదేశం:ఈ కేసును విచారణ చేపట్టిన హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టు కారు యజమానికి కారు పూర్తి ధరను అంటే రూ. 16.95 లక్షలను తిరిగి చెల్లించాలని టాటా మోటార్స్‌ను ఆదేశించింది.

ఓపెన్‌ ఏఐ సీటీవో మిరా మురాటి రాజీనామా- ఎందుకో తెలుసా? - OpenAI CTO Mira Murati Resigns

కేంద్రం స్కీమ్​తో ఫ్రీ కరెంట్- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా! - PM Surya Ghar Muft Bijli Yojana

ABOUT THE AUTHOR

...view details