Meta AI on Whatsapp:ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. వాట్సాప్‌లోని తన 'Meta AI'చాట్‌బాట్ సేవలతో యూజర్ ఇంటరాక్షన్స్‌ను మరింత మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ ఇటీవలే ఈచాట్బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ కాన్వర్జేషన్స్ను స్మార్ట్‌గా, మరింత సమర్థవంతగా చేసేందుకు ఈ ఫీచర్‌ను ఇండియాతో పాటు క్రమంగా ఇతర దేశాల్లో కూడా పరిచయం చేస్తోంది.
వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, టెక్స్ట్ కంటెంట్‌ను ప్రిపేర్ చేసేందుకు, టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి ఇమేజ్‌లను క్రియేట్ చేయడం, సమ్మరీస్ అండ్ ట్రాన్స్లేషన్స్తో పాటు ఇతర టాస్క్‌లలో సహాయం చేసేందుకు దీన్ని ఉపయోగించొచ్చు. మెటా.. దీన్ని ఇండియా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, సింగపూర్‌తో సహా 12 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ దీన్ని భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని యోచిస్తోంది.
ఈ 'Meta AI'ను వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ సహా meta.ai పోర్టల్‌లో వినియోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో వినియోగదారులు ఉచితంగానే ఏఐ ఫొటోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మెటా అభివృద్ధి చేసిన ఈ ఏఐ.. లామా 3.2 లాంగ్వెజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది.
ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లిష్ భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. త్వరలో దీన్ని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇది వాట్సాప్‌లో నేరుగా ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ప్రొడక్టవిటీ, క్రియేటివిటీని పెంపొందించడంలో సహాయపడుతుంది. దానికి పంపించిన మెసెజ్‌లను మాత్రమే ప్రాసెస్ చేయడం ద్వారా ఇది వినియోగదారుల గోప్యతను కాపాడుతుంది. ఈ సందర్భంగా వాట్సాప్ వ్యక్తిగత చాట్‌లో 'Meta AI'తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.