తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీకు ఎక్కువ జీ-మెయిల్​ అకౌంట్లు ఉన్నాయా? - ఒకే టైమ్​లో ఎలా లాగిన్​ కావాలో తెలుసా?

How to Sign in Multiple Gmail Accounts: మీకు ఒకటి కన్నా ఎక్కువ జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయా? మరి.. అన్ని అకౌంట్లలోకి ఒకేసారి ఎలా లాగిన్​ కావాలో తెలుసా? నో అంటే మాత్రం.. ఈ స్టోరీ చూసేయండి.

How to Sign in Multiple Gmail Accounts
How to Sign in Multiple Gmail Accounts

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 2:23 PM IST

How to Sign in Multiple Gmail Accounts:దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన జీ-మెయిల్ అతి కొద్ది కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. దానికనుగుణంగానే జీ-మెయిల్​ కూడా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు నూతన సేవలందిస్తూ వస్తోంది. అయితే.. ఇందులో ఉన్న కొన్ని బెస్ట్​ ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నప్పటికీ.. చాలా మంది నామమాత్రపు ఆప్షన్స్ మాత్రమే వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఒకటే మల్టిపుల్ అకౌంట్స్ ఆపరేట్ చేయడం. మరి.. ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఒకటికి మించిన జీ మెయిల్ అకౌంట్లు ఉండటం సర్వసాధారణమైపోయింది. పర్సనల్​ కోసం ఒకటి, బిజినెస్​ కోసం ఒకటి అంటూ చాలా జీ-మెయిల్ అకౌంట్స్ క్రియేట్​ చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఒకేసారి అన్ని అకౌంట్లనూ వినియోగించడం తెలియదు. దీంతో.. ఒక అకౌంట్​ లాగౌట్​ చేసిన తర్వాత.. మరో అకౌంట్​కు లాగిన్​ అవుతారు. దీంతో టైం వేస్ట్​ అవుతుంది. పనులు కూడా తొందరగా పూర్తి కావు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే.. జీ-మెయిల్​లోని యాడ్ అకౌంట్ ఆప్షన్ వినియోగించుకోవాలని సలహా ఇస్తున్నారు టెక్​ నిపుణులు. దీనివల్ల ఏ అకౌంటూ లాగౌట్ చేయకుండానే.. మీకు ఉన్న అన్ని అకౌంట్లనూ లాగిన్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్​ ఏంటి? ఎలా అకౌంట్లను యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీ ప్రైమరీ జీమెయిల్​ అకౌంట్​కు లాగిన్​ అవ్వాలి. అంటే.. మీ మెయిన్ అకౌంట్​ లాగిన్​ అవ్వాలి.
  • ఈ అకౌంట్ మీరు ఇతర అకౌంట్​లకు లాగిన్​ అవ్వడానికి ఉపయోగపడుతుంది.
  • మీరు జీమెయిల్​ అకౌంట్​కు లాగిన్​ అయిన తర్వాత.. స్క్రీన్​ మీద​ రైట్​ సైడ్​ కార్నర్​లో మీ ప్రొఫైల్​ ఐకాన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు Sign Out అండ్​ Add Another Account అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • అందులో Add Another Account అనే ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు కొత్త విండో ఓపెన్​ అవుతుంది. అక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది.
  • ఆ పేజీలో మీ రెండో అకౌంట్​కు సంబంధించిన యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి లాగిన్​ అవ్వాలి.
  • అంతే.. మీ రెండు అకౌంట్లు లాగిన్​లో ఉన్నాయని అర్థం. ఇలా ఎన్ని అకౌంట్లు కావాలంటే అన్ని అకౌంట్లనూ లాగిన్​ చేసుకోవచ్చు.
  • ఇప్పుడున్న అకౌంట్లోనుంచి మరో అకౌంట్లోకి వెళ్లాలంటే.. మీ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే.. మీరు యాడ్ చేసిన అకౌంట్లన్నీ కింద వరుసగా కనిపిస్తుంటాయి.
  • అందులో మీకు కావాలనుకున్న అకౌంట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
  • ఇలా.. మీరు ఒక జీమెయిల్ నుంచి లాగౌట్ చేయకుండానే.. మరో అకౌంట్​లోకి లాగిన్ కావొచ్చు. మరి.. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మీ అకౌంట్స్ యాడ్ చేసుకోండి.

ABOUT THE AUTHOR

...view details