తెలంగాణ

telangana

ETV Bharat / technology

ముఖ్యమైన ఫైల్స్ పర్మినెంట్​గా డిలీట్ అయ్యాయా? సింపుల్​గా రికవరీ చేసుకోండిలా! - Recover Lost Files On Windows PC - RECOVER LOST FILES ON WINDOWS PC

How To Recover Permanently Deleted Files From PC : మీ కంప్యూటర్​లోని కొన్ని ముఖ్యమైన ఫైల్స్ పర్మినెంట్​గా డిలీట్ అయిపోయాయా? వాటిని ఎలా రికవరీ చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. విండోస్​ పీసీలో లేదా SSD/ హార్డ్​ డిస్క్​/ మెమొరీ కార్డ్​ లాంటి ఎక్స్​టర్నల్ స్టోరేజ్​ల్లోని - శాశ్వితంగా డిలీట్ అయిపోయిన ఫైల్స్​ను, ఎలా ఈజీగా రికవరీ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Recover lost files on Windows 10
How To Recover Permanently Deleted Files From PC (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 2:52 PM IST

How To Recover Permanently Deleted Files From PC :మీ కంప్యూటర్​లోని కీలకమైన ఫైల్స్ పర్మినెంట్​గా డిలీట్ అయిపోయాయా? వాటిని ఎలా రికవరీ చేయాలో తెలియడం లేదా? డోంట్​ వర్రీ. విండోస్​ పీసీలో పర్మినెంట్​గా డిలీట్ అయిన ఫైల్స్​ను చాలా సులువుగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

విండోస్​ పీసీలో శాశ్వతంగా డిలీట్ అయిన ఫైల్స్​ను రికవరీ చేయడానికి థర్డ్ పార్టీ సాఫ్ట్​వేర్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో Disk Drill Data Recovery Software ఒకటి. దీనితో పర్మినెంట్​గా డిలీట్ అయిన డేటాను కూడా చాలా ఈజీగా రికవరీ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు స్టెప్​-బై-స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

  • ముందుగా మీరు Drill Data Recovery Software డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • తరువాత ఈ సాఫ్ట్​వేర్​ను మీ కంప్యూటర్​లో ఇన్​స్టాల్ చేసి, లాంఛ్ చేయాలి.
  • తరువాత ఎక్స్​టర్నల్ స్టోరేజ్ డివైజ్​లైన SSD/ హార్డ్​ డిస్క్​/ మెమొరీ కార్డ్​లను మీ కంప్యూటర్​కు ఇన్​సర్ట్​ చేయాలి.
  • ఇప్పుడు డ్రిల్ డేటా రికవరీ సాఫ్ట్​వేర్​ను ఓపెన్ చేయాలి.
  • మీకు అవసరమైన స్టోరేజ్ డ్రైవ్​ను సెలక్ట్​ చేసుకోవాలి.
  • సదరు స్టోరేజ్ డ్రైవ్​పై క్లిక్ చేసి Search for lost dataపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఆ సాఫ్ట్​వేర్ స్టోరేజ్ డ్రైవ్​ను స్కాన్ చేసి,​ పర్మినెంట్​గా డిలీట్ అయిన ఫైల్స్​ను వెతుకుతుంది.
  • ఇలా పర్మినెంట్​గా డిలీట్ చేసిన ఫైల్స్​ అన్నింటినీ రికవరీ చేయడానికి 3 నుంచి 4 గంటల వరకు పడుతుంది.
  • స్కానింగ్ కంప్లీట్ అయిన తరువాత శాశ్వితంగా డిలీట్ అయిన ఫైల్స్ అన్నింటినీ రికవరీ చేసేస్తుంది.
  • మీరు Review found itemsపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఈ విండోలో చాలా ఫైల్స్ కనిపిస్తాయి.
  • అలాగే ఆల్​ ఫైల్స్, పిక్చర్స్, వీడియో, ఆడియో, డాక్యుమెంట్స్, ఆర్కైవ్స్​, అదర్స్ అనే ఫిల్టర్స్ కనిపిస్తాయి.
  • వీటిలో మీకు అవసరమైన దానిని ఎంచుకోవాలి.
  • తరువాత Found Files ఫోల్డర్​ ఓపెన్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ఫైల్స్ కనిపిస్తాయి.
  • ఒక వేళ దానిలో మీకు కావాల్సిన ఫైల్​ లేకపోతే Reconstructed అనే ఫోల్డర్​లో చెక్ చేయాలి.
  • Found files ఫోల్డర్​లో చాలా ఫైల్స్ ఉంటాయి. వాటిలో డిలీట్ అయిన ఫైల్స్​ను మీరు చూడవచ్చు.
  • ఈ ఫైల్​ క్వాలిటీగా ఉందా, లేదా అని చూడడానికి పక్కనే ఉన్న eye ఐకాన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఆ ఫైల్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
  • ఫైల్ బాగానే ఉంటే, దానిని సెలెక్ట్ చేసుకుని, Recover బటన్​పై క్లిక్ చేయాలి.
  • మీకు ఇష్టమైన లొకేషన్​ను (డ్రైవ్-D​) ఎంచుకుని, ఓకే చేయాలి. అంతే సింపుల్​.
  • పర్మినెంట్​గా డిలీట్ అయిన ఫైల్ వెంటనే రికవరీ అయిపోతుంది.
  • రికవరీ అయిన తరువాత మీకు ఒక మెసేజ్ వస్తుంది.
  • వెంటనే Show recovered data పై క్లిక్ చేస్తే, పర్మినెంట్​గా డిలీట్ అయిన ఫైల్ మీకు లభిస్తుంది.
  • ఈ విధంగా మీ విండోస్​ పీసీలో శాశ్వతంగా డిలీట్ అయిన ఫైల్​ను కూడా చాలా ఈజీగా రికవరీ చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details