YouTube Tips To Grow Your Channel In 2024 :మీరు మంచి కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్ఫ్లూయెన్సర్గా పేరు సంపాదించాలని అనుకుంటున్నారా? సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్‌ను ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నారా? అయితే మీకు యూట్యూబ్ బెస్ట్ ప్లాట్‌ఫామ్ అవుతుంది. ప్రతి నెలా దాదాపు 2 బిలియన్ల మంది యూట్యూబ్‌ను చూస్తూ ఉంటారు. ఈ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో విద్య, వినోదం రెండూ కలగలిసి ఉంటాయి. కనుక ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
యూట్యూబ్ ఛానల్ వల్ల కలిగే లాభాలు
- ప్రేక్షకుల ఆదరణ : యూట్యూబ్‌కు సరిహద్దులు అంటూ ఏమీ లేవు. కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిమానాన్ని మీరు సంపాదించవచ్చు. చాలా మంది స్టార్ యూట్యూబర్లు ఇలా వచ్చినవారే.
- మోనటైజేషన్ : యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యాడ్స్, ఛానల్ మెంబర్షిప్స్, సూపర్ చాట్స్ ద్వారా; ప్రొడక్ట్స్ సేల్, అఫిలియేషన్ మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా సంపాదన పెంచుకోవచ్చు. సబ్స్క్రైబర్లు పెరుగుతున్న కొలదీ మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది.
- బ్రాండ్ బిల్డింగ్ : మీకంటూ ఒక బ్రాండింగ్‌ను సృష్టించుకోవడం వల్ల, సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ అనుభవం, వ్యక్తిత్వం, విలువలు గురించి ప్రజలకు తెలుస్తుంది.
- జ్ఞానం పంచుకోవడం : మీకు ఉన్న జ్ఞానాన్ని ట్యుటోరియల్స్ ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. దీని వల్ల చాలా మంది విజ్ఞానం, ప్రేరణ పొందుతారు.
How To Grow Youtube Channel :
1. మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకోవాలి!
- మీకు బాగా ఇష్టమైన, అనుభవం ఉన్న సబ్జెక్ట్‌నే ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు టీచింగ్ అంటే ఇష్టం అనుకుంటే, విద్యార్థులకు ఉపయోగపడే ట్యుటోరియల్స్ క్రియేట్ చేయాలి. అవి కూడా చాలా క్రియేటివ్‌గా ఉండాలి.
- ఈ విధంగా మీరు కుకింగ్, గేమింగ్, ట్రావెల్ వీడియోలు చేయవచ్చు. లేదా టెక్, ఆటోమొబైల్, సినిమా రివ్యూలు చేయవచ్చు. ఇలా మీకు ఏ విషయంపైన అభిరుచి ఉంటుందో, దానినే ఎంచుకోవచ్చు. కానీ వాటిపై మీకు సరైన అవగాహన/ నైపుణ్యం ఉండి తీరాలి.
- మీ టార్గెట్ ఆడియన్స్ గురించి కూడా బాగా ఆలోచించాలి. వారికి ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది? సబ్స్క్రైబర్లు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు? అనే విషయాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా వీడియోలు చేయాలి.
2. హై-క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి!
- వీడియో, ఆడియో క్వాలిటీ బాగా లేకపోతే, మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ప్రేక్షకులు చూడరు. అందువల్ల మంచి కెమెరా, మైక్రోఫోన్, లైటింగ్ సెటప్ ఏర్పాటు చేసుకుని హై క్వాలిటీ వీడియోలు తీయాలి.
- మీకంటూ ఒక కంటెంట్ క్యాలెండర్‌ను రూపొందించుకోవాలి. రెగ్యులర్‌గా వీడియోలు చేస్తుండాలి.
- వ్యూయర్స్ చేసే కామెంట్స్‌కు రెస్పాండ్ అవ్వాలి. సబ్స్క్రైబర్ల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. స్ట్రాంగ్ కమ్యూనిటీని పెంచుకోవాలి.
3. సరైన కీవర్డ్స్ ఇచ్చి ఆప్టిమైజ్ చేసుకోవాలి!
- మనం ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసినా, సరైన కీవర్డ్స్ ఇవ్వకపోతే యూట్యూబ్‌లో మన వీడియోలు యూజర్లకు చేరవు. ఫలితంగా మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెద్దగా పెరగదు. అందువల్ల గూగుల్ కీవర్డ్ ప్లానర్, ట్యూబ్బడ్డీ లాంటి వాటిని వాడుకోవాలి. ఇవి మీ కంటెంట్‌కు తగిన కీవర్డ్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఇస్తాయి. ఇవి సెర్చ్ ఆప్టిమైజేషన్‌ను పెంచి, మీ వీడియోను ఎక్కువ మంది చూసేలా చేస్తాయి.
- కచ్చితంగా ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే యూజర్లు మీ వీడియోపై క్లిక్ చేస్తారు. మీ కంటెంట్ బాగుంటే సబ్‌స్క్రైబ్ కూడా చేసుకుంటారు.
4. ఛానల్‌ని ప్రమోట్ చేసుకోవాలి!
- మీ యూట్యూబ్ ఛానల్‌ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయాలి.
- మిగతా యూట్యూబర్స్‌తో కలిసి క్రాస్-ప్రమోషన్ చేసుకోవాలి. దీనివల్ల మీ సబ్స్క్రైబర్లు పెరుగుతారు.
5. విశ్లేషించుకోవాలి - సరిదిద్దు కోవాలి!
- మీ ఆడియెన్స్ రిటెన్షన్, వాచ్ టైమింగ్, డెమోగ్రాఫిక్స్ అన్నింటినీ పరిశీలించాలి. వాటిని చాలా కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ఏమైనా లోపాలు, పొరపాట్లు ఉంటే, వాటిని సరిదిద్దుకోవాలి.
- అవసరమైతే నిపుణుల, తోటి యూట్యూబర్ల సలహాలు తీసుకోవాలి.
6. లేటెస్ట్ ట్రెండ్స్, టిప్స్ పాటించాలి!
- యూట్యూబ్ షార్ట్స్ : నేడు యూట్యూబ్ షార్ట్-వీడియోస్‌ను విపరీతంగా చూస్తున్నారు. కనుక ఆకర్షణీయమైన షార్ట్స్‌ను రూపొందించి, ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి.
- లైవ్ స్ట్రీమింగ్ : మీరే స్వయంగా హోస్ట్ చేస్తూ, యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రొడక్ట్స్ లాంఛ్ చేయండి. అప్పుడప్పుడు మీ స్టూడియో టూర్ చేయండి. అలాగే మీరు వీడియో తీసే విధానాన్ని (గ్లింప్స్)ను కూడా మీ సబ్స్క్రైబర్లతో పంచుకోండి. రియల్-టైమ్‌లో ఆడియన్స్‌తో మాట్లాడి, వారితో పర్సనల్ ఎటాచ్మెంట్ పెంచుకోండి.
- స్టోరీ టెల్లింగ్ :అప్పుడప్పుడు మీ సొంత విషయాలను, మీ కష్టసుఖాలను కూడా సబ్స్క్రైబర్లతో పంచుకోండి. వారి కష్టసుఖాలు కూడా తెలుసుకోండి. అప్పుడే వారు మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
- మొబైల్ ఆప్టిమైజేషన్ : చాలా మంది సెల్ఫోన్లోనే వీడియోలు చూస్తుంటారు. కనుక ఆ చిన్న స్క్రీన్‌లోనూ మీ కంటెంట్ అద్భుతంగా కనిపించేలా చేయాలి. ఇందుకోసం మంచి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి.
- ఓపిక తప్పనిసరి : యూట్యూబ్‌లో సక్సెస్ కావడం అంత సులువేమీ కాదు. దీనికోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలా ఓపికతో, డెడికేషన్‌తో, క్రియేటివ్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ట్రెండ్‌కు అనుగుణంగా పనిచేస్తూ, ఓపిక మీద ఉంటే కచ్చితంగా యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్!
వాట్సాప్ నయా సేఫ్టీ ఫీచర్‌తో - గ్రూప్ స్కామ్స్‌కు చెక్! - WhatsApp New Safety Feature
మీ గూగుల్ 'యాక్టివిటీ'ని డిలీట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How to Delete Google Search History