How To Clean Phone In Telugu: ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. వాటి వినియోగం కూడా బాగానే పెరిగింది. మొబైల్స్‌ను ఎక్కువగా వాడతారు కానీ దానిని శుభ్రం చేసుకోరు. దీని వల్ల ఫోన్ మీద బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. అందులో మనకు అనారోగ్యం కలిగించేవి కూడా చాలానే ఉంటాయి. అనారోగ్యాన్ని కలిగించే ఈ-కోలై, స్ట్రెప్ లాంటి హనికరమైన బ్యాక్టీరియాలు దాదాపు 92 శాతం మొబైల్స్‌లో ఉంటున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే ఎప్పటిప్పుడు ఫోన్స్ శుభ్రం చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
రోజూకు ఒకసారి తప్పసరి
ఫోన్స్ మీద ఉండే బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు మన కంటికి కనపించవు. అందువల్ల రోజూ వాటిని శుభ్రం చేసుకుంటే మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొందరైతే మనం బయటి నుంచి ఇంటికెళ్లిన ప్రతిసారీ శుభ్రం చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం పెద్ద కష్టమేం కాదు. సులభంగానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి.
ఇంట్లోనే ఫోన్స్ స్క్రీన్ శుభ్రం చేయండిలా!
ఫోన్స్‌ని శుభ్రం చేయటం కోసం ఒక మైక్రోఫైబర్ క్లాత్ కావాలి. ముందుగా మీ ఫోన్ స్వీచ్‌ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ కేస్ తీసేయాలి. ఎందుకుంటే మూలల్లో కూడా సూక్ష్మజీవులు, క్రిములు ఉండే అవకాశముంది. అందువల్ల ఫోన్ శుభ్రపరిచేటప్పుడు ఫోన్ కేస్ కూడా తీసేయడం చాలా ముఖ్యం. స్క్రీన్‌పై వేసిన గ్లాస్ పాడైపోయినా లేదా కొంచెం పగిలి ఉన్నా దాన్ని తొలగించాలి. లేకుంటే ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది. అందుకే ఫోన్ మొత్తాన్ని మైక్రోఫైబర్ క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. కెమెరా లెన్స్‌లు, వాటి అంచుల్ని కూడా శుభ్రం చేయాలి.