How To Charge IPhone Faster :ఐఫోన్ ఛార్జ్ చేయడానికి సామాన్యంగా కాస్త ఎక్కువ టైమే పడుతుంది. కానీ కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉపయోగిస్తే చాలు, ఐఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మీ పాత ఛార్జర్‌ను అప్‌గ్రేడ్ చేయండి!
పాత ఛార్జర్‌తో ఐఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే యూఎస్బీ-సీ టూ లైటెనింగ్ కలిగిన 20-వాట్ సామర్థ్యం గల పవర్ అడాప్టర్‌ను తీసుకోవాలి. అప్పుడే ఐఫోన్ 8, దాని తరువాత తరం మోడల్స్‌ను కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు ఒక గంట సమయం ఉంటే, దానిని ఫుల్ ఛార్జ్ కూడా చేసేయవచ్చు. అదే మీ దగ్గర అంత టైమ్ లేకపోతే, కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేసినా చాలు. మీ ఐఫోన్ ఛార్జింగ్ కనీసం రెండు అంకెలకైనా పెరుగుతుంది.
ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఐఫోన్‌తో కేవలం కేబుల్ మాత్రమే ఇస్తోంది. పవర్ అడాప్టర్‌ను మీరు వేరుగా కొనాల్సి వస్తోంది. కనుక కనీసం 20 వాట్ సామర్థ్యం కలిగిన ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుక్కోవడం మంచిది.
2. వైర్లెస్ ఛార్జింగ్
'యాపిల్ మాగ్‌సేఫ్ ఛార్జర్'తో ఐఫోన్ 12, దాని తరువాతి వెర్షన్లను వైర్‌లెస్‌గా చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇందుకోసం 20-వాట్ పవర్ అడాప్టర్, 15-వాట్ వైర్లెస్ ఛార్జర్ తీసుకోవచ్చు. దీని వల్ల మీ ఐఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లోనే 30 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ స్టాండర్డ్ క్యూఐ వైర్లెస్ ఛార్జర్ కేవలం 7.5 వాట్ సామర్థ్యంతో ఛార్జింగ్ చేస్తుంది. కానీ మాగ్‌సేఫ్ ఛార్జర్ 15 వాట్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మాగ్‌సేఫ్ సర్టిఫై చేయని మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్లు చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతాయి. కనుక వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
3. కంప్యూటర్ ద్వారా ఛార్జ్ చేయవద్దు!
చాలా మంది యాపిల్ ల్యాప్‌టాప్ ద్వారా ఐఫోన్లను ఛార్జ్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. మీ కంప్యూటర్లోని యూఎస్బీ పోర్ట్ ఎంత పెద్దగా ఉన్నా; అది యూఎస్బీ-ఏ అయినా, యూఎస్బీ-సీ అయినా; లేదా మీ కంప్యూటర్ ఎంత కొత్తదైనా, పాతదైనా సరే, అది 5-వాట్ కన్నా ఎక్కువ పవర్‌ను అడాప్టర్‌కు ఇవ్వదు. కనుక మీ ఐఫోన్ త్వరగా ఛార్జ్ కావడానికి ఇది ఏ మాత్రం సాయపడదు.
4. ఛార్జింగ్ చేసేటప్పుడు ఐఫోన్ వాడొద్దు!
ఛార్జింగ్ చేసేటప్పుడు ఐఫోన్‌ను వాడకండి. ఎందుకంటే, ఫోన్లో మీరు వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుంటే, ఛార్జింగ్ చాలా స్లో అయిపోతుంది.