How to Block Spam Calls and Texts:ఇటీవల కాలంలో టెలికాం యూజర్లను స్పామ్ కాల్స్, ఫేక్ మెసేజ్‌ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందుకోసం రోబోకాల్స్ వంటి టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం స్పామ్ కాల్స్, ఫేక్ SMSల నుంచి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే ఇలా చేస్తే ఈ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
జియో సిమ్‌లో స్పామ్ కాల్స్, ఫేక్ SMSలను బ్లాక్ చేసేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. వినియోగదారులు వారి ప్రిఫరెన్సెస్ బట్టి అందులో ఆప్షన్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే మనకు ఇకపై స్పామ్ కాల్స్ రావు. అదే సమయంలో మన ఇంపార్టెంట్ కాల్స్‌ను కూడా మనం మిస్సవ్వకుండా పొందుతాం.
జియో స్పామ్ కాల్స్ బ్లాకింగ్ విధానం: MyJio యాప్‌లో కేవలం ఒకే సర్వీస్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా అన్వాంటెడ్ కాల్స్, మెసెజెస్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. OTPతో బ్రాండ్‌ల నుంచి ముఖ్యమైన మెసెజ్‌లు, అప్డేట్లను పొందుతూనే వినియోగదారులు స్పామ్ కాల్స్‌ను పూర్తిగా బ్లాక్ చేసుకోవచ్చు. అందులో అడ్వర్టైజింగ్ కాల్స్‌ను పాక్షికంగా బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.