Honda Overtakes Hero Motocorp:ప్రముఖ టూ- వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా హీరో మోటోకార్ప్‌ను దాటేసింది. సెప్టెంబర్ నెలలో రికార్డ్ అయిన రిటైల్ విక్రయాల్లో హీరో కంటే మెరుగైన సేల్స్‌తో దేశంలోనే అత్యధిక టూ- వీలర్ వాహనాలు విక్రయించిన కంపెనీగా అవతరించింది. రిటైల్ సేల్స్‌కు సంబంధించి ఫాడా (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
27.73 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్‌గా:
ఫాడా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో హోండా 62,537 యూనిట్ల సేల్స్‌తో 27.73 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.
హీరో మోటోకార్ప్ 22.54 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
గతేడాదితో పోలిస్తే రెండు కంపెనీల సేల్స్ తగ్గడం గమనార్హం.
టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా టాప్-5 స్థానాల్లో ఉన్నాయి.