HMD Fusion Smartphone Launched: HMD గ్లోబల్ కంపెనీ తన 'ఫ్యూజన్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ప్రత్యేకత ఏంటంటే దాని స్మార్ట్ ఔట్ఫిట్. ఈ డిటాచబుల్ యాక్సెసరీస్ ఫోన్ లుక్‌ను మార్చడం మాత్రమే కాకుండా పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాక దీని కెమెరా అద్భుతమైన విజువల్స్‌ను ఇస్తుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
స్పెసిఫికేషన్స్:ఈ కొత్త HMD ఫ్యూజన్ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజీ సదుపాయం ఉంటుంది. దీనితో సీమ్‌లెస్ మల్టీటాస్కింగ్‌తో పాటు వినియోగదారులు మంచి పనితీరును పొందొచ్చు. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ వర్చువల్ మెమరీ ఎక్స్టెన్షన్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది దాని సామర్థ్యాలను మరింత పెంచుతుంది.
కెమెరా సెటప్:ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్108MP డ్యూయల్ మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వీటితో పాటు ఇది నైట్ మోడ్ 3.0, ఫ్లాష్ షాట్ 2.0, జెస్టర్-బేస్డ్ సెల్ఫీ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని ఇస్తుంది.
- డిస్ప్లే: 6.56-అంగుళాల HD+
- రిఫ్రెష్ రేట్: 90Hz
- బ్యాటరీ:5000mAh
- 33W ఫాస్ట్ ఛార్జింగ్
డ్యూరబిలిటీ అండ్ స్టెబిలిటీ:ఈ మొబైల్ డ్యూరబిలిటీ అండ్ స్టెబిలిటీ గురించి రెండు ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీకి చెందిన Gen2 రిపేరబిలిటీ డిజైన్ డిస్ప్లే, బ్యాటరీ లేదా ఛార్జింగ్ పోర్ట్ వంటి భాగాలను సులభంగా రీప్లేస్ చేసే విధంగా రూపొందించారు. దీని భాగాలను కేవలం స్క్రూడ్రైవర్తోనే రీప్లేస్ చేయొచ్చు.