తెలంగాణ

telangana

ETV Bharat / technology

'అంతర్గతంగా వివాదాస్పద విధానాలు పాటించిన గూగుల్- మెసేజ్​ల​ను మాయం చేయడమే వ్యూహం' - GOOGLE

'మెసేజ్​లను డిలీట్‌ చేసేయాలని ఉద్యోగులకు సూచించిన గూగుల్'

Google
Google (Getty Images)

By ETV Bharat Tech Team

Published : Nov 21, 2024, 1:30 PM IST

Google: టెక్ దిగ్గజం గూగుల్‌ యాంటీ ట్రస్ట్‌ కేసులను తప్పించుకొనేందుకు కొన్నేళ్లపాటు అంతర్గతంగా వివాదాస్పద విధానాలు పాటించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఇంటర్నల్​ కమ్యూనికేషన్‌లో భాగంగా పంపిన కొన్ని రకాల మెసెజెస్​ను డిలీట్‌ చేసేయాలని గూగుల్ తన ఉద్యోగులకు చెప్పినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

అంతేకాక కొన్ని రకాల పదాలను వినియోగించడం మానేయాలని సూచించింనట్లు తెలిపింది. 2008 నుంచి కంపెనీ ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తోందని పేర్కొంది. కానీ దీనిపై న్యాయస్థానాల్లో అభ్యంతరాలు రావడంతో గూగుల్ తన విధానాలను మార్చుకుందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది.

న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. "గూగుల్.. యాహూ తనకు ప్రత్యర్థిగా ఉన్న రోజుల్లో ఓ యాంటీ ట్రస్ట్‌ దర్యాప్తును ఎదుర్కొంది. దీంతో 2008 నుంచి గూగుల్ తన ఎంప్లాయిస్​కు ఇలాంటి మెమోలను పంపించి అప్రమత్తం చేయడం మొదలుపెట్టింది.

'ఊహాగానాలు, వెక్కిరింతలకు ఉద్యోగులు దూరంగా ఉండాలి. హాట్‌టాపిక్స్‌ అయిన మెసేజ్​లను ఒకరి నుంచి మరొకరికి పంపే సమయంలో ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకోవాలి. అంతేకాకుండా వాస్తవాలు తెలియకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు.' అని గూగుల్ మెమోలో పేర్కొంది.

అదే సమయంలో గూగుల్‌ తన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ టెక్నాలజీని కూడా మార్చింది. దీనిలో కొన్ని రకాల పదాలను మర్నాటికల్లా తొలగించేటట్లు ఏర్పాట్లు చేసింది. వీటిపై అటార్నీ-క్లైంట్‌ ప్రివిలైజ్డ్‌ అని ఉంచమని ఉద్యోగులను ప్రోత్సహించింది. అప్పుడు దానిని రహస్య సమాచారంగా భావించి బహిర్గతం చేయరు. అంటే గూగుల్ ప్రపంచ సమాచారాన్ని నిల్వ చేసినప్పటికీ అది తన ఇంటర్నల్ కమ్యూనికేషన్లపై కన్పించకుండా ఏర్పాట్లు చేసింది.

గతేడాది గూగుల్‌ మొత్తం 3 యాంటీ ట్రస్ట్‌ కేసులను ఎదుర్కొంది. ఇంటర్నల్​ కమ్యూనికేషన్లలో ఇలాంటి చర్యలతో అన్ని చోట్లా న్యాయమూర్తుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. 2008లో పంపిన మెమోలపై ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లో వాకర్‌, బిల్‌ కొఘ్రాన్‌ సంతకాలు చేశారు. దీనిపై ఓ కేసు విషయంలో వాకర్‌ న్యాయమూర్తి ఎదుట స్పందిస్తూ.. 'ఇదేమీ రహస్య సంస్కృతిని ప్రోత్సహించడం కాదు' అని అన్నారు. గూగులర్లకు కొన్నింటికి అర్థాలు తెలియకపోవడమే సమస్యగా మారిందని పేర్కొన్నారు.

న్యాయస్థానాల్లో అభ్యంతరాలు రావడంతో గతేడాది నుంచి గూగుల్‌ తన ప్రొసీజర్స్‌ను మార్చుకుంది. ప్రతిదానిని డీఫాల్ట్‌గా సేవ్‌ చేయడం మొదలుపెట్టింది. లిటిగేషన్లలో ఉన్న ఎంప్లాయిస్ చాట్‌ హిస్టరీని ఆఫ్‌ చేయకుండా కొనసాగిస్తోంది."

వావ్.. ఏం క్రియేటివిటీ రా సామీ..!- జాగ్వార్ కొత్త లోగో, బ్రాండ్​ ఐడెంటిటీ డిజైన్ చూశారా?

రూ. 8,499కే 5G స్మార్ట్​ఫోన్- బంపర్ ఆఫర్ అంటే ఇదే.. దీన్ని అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా..!

ABOUT THE AUTHOR

...view details