Android 16 to Release in Q2 2025:ఆండ్రాయిడ్ 16 అప్డేట్ ఊహించిన దాని కంటే త్వరలోనే వస్తోంది. ఈ మేరకు గూగుల్ రిలీజ్ స్ట్రాటజీని పంచుకుంది. అయితే గత నెల అక్టోబర్‌లో పిక్సెల్ మొబైల్స్‌కు రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ OS తాజా వెర్షన్‌లా కాకుండా, గూగుల్ తన నెక్ట్స్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలోనే లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
కంపెనీ దాని ఎకో సిస్టమ్ అంతటా డివైస్ లాంచ్‌ల షెడ్యూల్‌తో OSని బెటర్ ఎలైన్ చేసేందుకు రిలీజ్ విండోను మారుస్తున్నట్లు తెలిపింది. తద్వారా మరిన్ని డివైజస్ ఆండ్రాయిడ్ మేజర్ రిలీజ్‌ను త్వరగా పొందగలుతాయని పేర్కొంది. యాప్ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తూ యూజర్స్‌కు సరికొత్త ఫీచర్లను అందించేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు SDK (ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్) అందిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో గూగుల్ Q2 2025లో (సాధారణ Q3 లాంచ్ విండోకు బదులుగా) మేజర్ లాంచ్ ఉంటుందని హింట్ ఇచ్చింది. దాని తర్వాత నాల్గో త్రైమాసికంలో మైనర్ రిలీజ్ ఉంటుందని తెలిపింది. గూగుల్ Q1 2025లో ఫీచర్లు మాత్రమే అప్డేట్ను అనుసరించి, ఆండ్రాయిడ్ Q2లో మేజర్ SDKను అందిస్తుంది. OS వెర్షన్‌ను ఆండ్రాయిడ్ 16కి అప్‌గ్రేడ్ చేస్తుంది. గూగుల్ Q3 2025లో వేరే ఫీచర్లను మాత్రమే అప్డేట్ చేస్తుంది. తర్వాత Q4 2025లో మైనర్ SDK రిలీజ్ అవుతుంది.
ఆండ్రాయిడ్‌లో మేజర్, మైనర్ SDK రిలీజెస్ రెండూ వరుసగా Q2, Q4లో రావడానికి సెట్ చేశారు. ఇందులో కొత్త డెవలపర్ APIలు కూడా ఉంటాయి. Q2 మేజర్ రిలీజ్ యాప్స్‌ను ప్రభావితం చేసే ప్రవర్తన మార్పులు ఉంటాయి. ఇవి ఆండ్రాయిడ్‌లో యాప్‌లు ఎలా పనిచేస్తాయనే దానిపై ప్రభావం చూపుతాయి. Q4 రిలీజ్ కొత్త డెవలపర్ APIలతో పాటు ఆప్టిమైజేషన్స్, బగ్ పరిష్కారాలతో పాటు ఫీచర్ అప్డేట్స్ను అందుకుంటుంది. ముఖ్యంగా Q4 మైనర్ అప్‌డేట్‌లో యాప్ ఇంపాక్టింగ్ ప్రవర్తన మార్పులు ఉండవు.