Google New Feature:ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే క్యాలెండర్ యాప్‌లో ఈ ఫీచర్‌ను జోడించింది. దీంతో ఇకపై టాస్క్ మేనేజ్‌మెంట్‌ను చాలా సులభతరం కానుంది. దీని సహాయంతో టాస్కులు క్రియేట్ చేయడం, వాటిని ఎడిట్ చేయడం, సబ్ టాస్క్‌లను సులువుగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే గతేడాది కేవలం వెబ్ యూజర్లకు తీసుకొచ్చన ఫుల్ స్క్రీన్ ఆప్షన్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లూ వాడుకోవచ్చన్నమాట.
దీన్ని ఉపయోగించడం ఎలా?:
- గూగుల్ క్యాలెండర్ హోంస్క్రీన్‌లో యూజర్ ప్రొఫైల్ పక్కనే చెక్‌మార్క్‌తో ఓ ఆప్షన్ కన్పిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే మై టాస్క్స్, ట్రావెల్, న్యూ లిస్ట్ అనే ఆప్షన్లు కన్పిస్తాయి.
- అందులో మనం చేయాల్సిన టాస్క్‌లు, పూర్తయిన టాస్క్‌లు, కొత్త టాస్క్‌ల వివరాన్నీ ఒకేచోట కన్పిస్తాయి.
- అయితే ప్రస్తుతం గూగుల్ వర్క్‌స్పేస్ యూజర్లకు, గూగుల్ వర్క్‌స్పేస్ ఇండివిడ్యువల్ కస్టమర్లు, వ్యక్తిగత గూగుల్ అకౌంట్లు కలిగిన వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
- ఇప్పటికే ఈ సదుపాయాన్ని రోల్అవుట్ చేశారు.
- త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.