Gmail Chat Style Interface : జీమెయిల్ యూజర్లు అందరికీ గుడ్ న్యూస్. త్వరలో జీ-మెయిల్లో చాట్-స్టైల్ ఇంటర్ఫేస్ను తీసుకువచ్చేందుకు గూగుల్సిద్ధమవుతోంది. మరో మూడు నెలల్లో ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు మరింత సులువుగా ఈ-మెయిల్స్‌కు రిప్లై ఇచ్చేందుకు వీలు అవుతుంది.
యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్
Chat Style Interface For Gmail Reply : మనం ఏదైనా ఈ-మెయిల్ ఓపెన్ చేసినప్పుడు, కింద రిప్లై బాక్స్ కూడా కనిపిస్తుంది. దీనిలో మన సమాధానాన్ని రాసి పంపిస్తూ ఉంటాం. దీనిని మరింత యూజర్ ఫ్రెండీగా మార్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఈ-మెయిల్ రిప్లై బాక్స్ ఇంటర్ఫేస్ను చాట్-స్టైల్లోకి మారుస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది.
- సాధారణంగా మనకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేస్తే, దాని కింది భాగంలో రిప్లై/ రిప్లై ఆల్/ ఫార్వర్డ్/ ఎమోజీ ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే ఇకపై ఈ-మెయిల్ పైభాగంలోనే ఈ ఆప్షన్లు అన్నీ కనిపించే అవకాశం ఉందని '9టూ5గూగుల్' అనే పోర్టల్ పేర్కొంది.
- ఆండ్రాయిడ్ పోలీస్ అనే మరో పోర్టల్ ప్రకారం, 'జీ-మెయిల్లో కింది భాగంలో ఉండే రిప్లై బాక్స్‌ను, గూగుల్ చాట్ లాంటి ఇంటర్ఫేస్తో తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా దీనిలో పిల్-షేప్ కంటైనర్లు, బటన్స్, అటాచింగ్ మీడియా, ఎమోజీలు అన్నీ ఉంటాయి.'
జీ-మెయిల్ యూజర్లకు గూగుల్ చాట్ ఇంటర్ఫేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీకు వచ్చిన లేదా మీరు పంపించిన ఈ-మెయిల్స్‌ను ఫుల్ స్క్రీన్‌లో చూసుకోవచ్చు. మీరు కావాలని అనుకుంటే, రిసిపెంట్ వివరాలను స్క్రీన్ ఎడమవైపు సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ-మెయిల్ కంపోజ్ చేసేటప్పుడు, కీబోర్డ్ కూడా కనిపిస్తుంది. సెండ్ బటన్ కుడివైపు ఉంటుంది. అయితే క్విక్ రిప్లై ఆప్షన్ ఎలా, ఎక్కడ ఉంటుందో ఇంకా తెలియరాలేదు.