తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles - FLIPKART OFFERS ON MOBILES

Flipkart Big Billion Days Offers on Mobiles: పండగ సీజన్ మొదలుకానున్న వేళ ఫ్లిప్​కార్ట్ స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన బిగ్‌ బిలియన్‌ డేస్​ సేల్స్​లో భాగంగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను రివీల్ చేసింది. అవేంటంటే?

Flipkart_Big_Billion_Days_Offers_on_Mobiles
Flipkart_Big_Billion_Days_Offers_on_Mobiles (Flipkart)

By ETV Bharat Tech Team

Published : Sep 18, 2024, 2:31 PM IST

Flipkart Big Billion Days Offers on Mobiles:స్మార్ట్​ఫోన్ లవర్స్​కు ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్​ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్లను తెచ్చింది. పండగ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో బిగ్‌ బిలియన్‌ డేస్​కు ఇటీవలే తేదీలను ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 26నే సేల్‌ అందుబాటులోకి కానుంది.

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు అందించనుంది. దీంతో ఈసారి సేల్స్​లో కస్టమర్లు భారీ ఆఫర్​లను పొందనున్నారు. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్​కార్ట్ రివీల్‌ చేసింది. వాటిలో గూగుల్‌ పిక్సెల్‌8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే:

  • Google Pixel 8: ఫ్లిప్​కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ మొబైల్‌ 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ఎమ్మార్పీ రూ.75,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకే లభించనుంది.
  • Samsung Galaxy S23: శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 8జీబీ+ 128జీబీ వేరియంట్‌నూ రూ.40వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు.
  • Samsung Galaxy S23 FE: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ బేస్‌ వేరియంట్‌ మొబైల్‌ రూ.30వేల లోపే లభించనుంది.
  • Poco X6 Pro 5G: పోకో ఎక్స్‌6 ప్రో 5జీ కూడా రూ.20వేల లోపే కొనుగోలు చేయొచ్చు.
  • వీటితో పాటు సీఎంఎఫ్‌ ఫోన్‌1, నథింగ్‌ ఫోన్‌2ఏ, పోకో ఎం6 ప్లస్‌, వివో టీ3ఎక్స్‌, ఇన్ఫినిక్స్‌ నోట్‌40 ప్రో.. మొబైల్స్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

ఈ కార్డులు ఉన్నవారి ఆఫర్లే.. ఆఫర్లు!:

  • ఫ్లిప్‌కార్ట్‌ బిగ్​ బిలియన్ డేస్ సేల్‌లో HDFC క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ఉన్నవారికి మంచి డిస్కౌంట్‌ అందించనున్నారు.
  • HDFC కార్డ్‌ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు అందిస్తున్నట్లు కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.
  • ప్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా కస్టమర్ లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది.
  • దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా నో- కాస్ట్‌ EMI సదుపాయం పొందొచ్చు.

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో మార్కెట్లోకి HMD కొత్త మొబైల్‌- ధర, ఫీచర్లు ఇవే! - HMD Skyline Launched

ABOUT THE AUTHOR

...view details