తెలంగాణ

telangana

ETV Bharat / technology

3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌- ఈ ప్లాన్​తో అమేజింగ్ ఆఫర్స్! - 3 Months Free Internet - 3 MONTHS FREE INTERNET

3 Months Free Internet: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి భారతదేశంలోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను పెంచాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఓ కంపెనీ ఫ్రీ ఇంటర్నెట్ అందుస్తోంది.

3 Months Free Internet
3 Months Free Internet (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Oct 1, 2024, 2:34 PM IST

Updated : Oct 1, 2024, 2:59 PM IST

3 Months Free Internet: ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేస్తున్న వేళ ఎవరైనా మీకు 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ ఇస్తారంటే నమ్ముతారా? నమ్మటానికి కాస్త సంకోచిస్తారు.. కానీ ఇది నిజమేనండీ బాబూ. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ కంపెనీలకు పోటీగా ఓ సంస్థ తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందజేస్తోంది. ఈ సంస్థ పేరు ఎక్సిటెల్. ఈ కంపెనీ తన కస్టమర్లకు 3 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ అందించటమే కాక 18 రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

ధర తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ:

  • ఈ కొత్త ఎక్సైటెల్ కంపెనీ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.
  • ఈ ఆఫర్ కింద కంపెనీ 3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్, 18 రకాల OTT (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
  • ఎక్సైటెల్ తక్కువ ధరకేరీఛార్జ్ ప్లాన్ తీసుకురావటంతో పాటు కస్టమర్లుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది.

ఎక్సిటెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇదే:

Excitel Recharge Plan (Excitel)
  • ఎక్సైటెల్ కంపెనీ కొత్త రీఛార్జ్ ఆఫర్ నెలకు రూ.499.
  • 9నెలల పాటు మీరు ఇంటర్నెట్ ఉపయోగిస్తే, మీకు 3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్ లభిస్తుంది.
  • దీంతోపాటు 18 OTT ప్లాట్‌ఫారమ్‌లు, 150 కంటే ఎక్కువ ఛానెల్‌లను చూడవచ్చు.
  • ఈ ఆఫర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

18 OTT ప్లాట్‌ఫారమ్‌ల బెనిఫిట్స్:

Excitel Recharge Plan (Excitel)
  • ఈ ఆఫర్‌లో మీరు Amazon Prime, Disney + Hotstar, Sony Liv, Altbalaji వంటి మరెన్నో 18 OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ పొందొచ్చు.
  • ఈ ఆఫర్​తో ఎక్సిటెల్ కస్టమర్లను ఆకర్షిస్తోంది.
  • మంచి నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
  • ఈ ప్లాన్ మీకు ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్​ను, ఉచిత స్మార్ట్ టీవీ లేదా HD ప్రొజెక్టర్‌ను కూడా అందిస్తుంది.
  • ఎక్సిటెల్ కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ 35 కంటే ఎక్కువ నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్:

  • ఈ నెల ప్రారంభంలో Excitel బిగ్ స్క్రీన్ ప్లాన్ అనే రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రారంభించింది.
  • ఈ ప్లాన్‌ల ధర రూ.1,299, రూ.1,499.
  • ఈ ప్లాన్‌లలో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్, OTT సబ్‌స్క్రిప్షన్, ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, ఉచిత స్మార్ట్ టీవీ లేదా HD ప్రొజెక్టర్‌లను పొందుతారు.
  • ప్రస్తుతం ఈ ఆఫర్ 35 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది.

మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా?- డోంట్ వర్రీ స్కీన్ టైమ్ తగ్గించుకోండిలా! - Screen Time Reduction Tips

వాట్సాప్ మెటా ఏఐలో సరికొత్త ఫీచర్లు- వీటి ఉపయోగం తెలిస్తే వావ్ అంటారంతే! - Meta AI Introduces 3 New Features

Last Updated : Oct 1, 2024, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details